వేతనాలు అందక అవస్థలు పడుతున్న స్పందించని ప్రభుత్వం
AIYF జిల్లా సహాయ కార్యదర్శి ఎస్కే చాంద్ పాషా
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ రాష్ట్రంలోఈ గ్రామ పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లు ఐదు నెలల నుంచి వేతనలు లేక అల్లాడుతున్న ప్రభుత్వం, పట్టించుకోవటం లేదని AIYF జిల్లా సహాయ కార్యదర్శి ఎస్కే చాంద్ పాషా విమర్శించారు ఈ గ్రామపంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లు గ్రామపంచాయతీయులకు సంబంధించిన పూర్తి వివరాలు నమోదు చేయటం ధ్రువపత్రాల జారీ ప్రభుత్వ పథకాలు దరఖాస్తులతో పాటు ఎన్నికల విధుల్లో రాత్రి పగలు తేడా లేకుండా పనిచేశారు జిల్లా వ్యాప్తంగా 83 మంది ప్రస్తుతం విధుల్లో కొనసాగుతున్నారు సకాలంలో జీతాలు రాక కంప్యూటర్ ఆపరేటర్ల కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులతో కుటుంబాలు గడవని పరిస్థితిలో ఉన్నారని ప్రభుత్వం తక్షణమే స్పందించి కేవలం జీతభత్యాలతోనే జీవనం సాగిస్తున్న పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్ల వేతనాలు విడుదల చేయాలని కోరారు