డైలీ భారత్, సిరిసిల్ల: ఈరోజు మైండ్ కేర్ అండ్ కౌన్సిలింగ్ సెంటర్, ఆధ్వర్యంలో వెంకట్రావు నగర్ లోని కార్మికుల కోసం మనోవికాస సదస్సును ప్రముఖ సైకాలజిస్ట్ కె. పున్నం చందర్ నిర్వహించి కార్మికులకు ఆరోగ్యంపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...
కార్మికులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చాలా ముఖ్యమని తెలిపారు.
రోజువారీ జీవితంలో సరైన జీవన విధాన మార్పులు చేసుకోవడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని చెప్పారు.
పొగ త్రాగడం, మద్యం సేవించడం వంటి చెడు అలవాట్లను పూర్తిగా వదిలేయాలని, శరీరానికి ఉపయోగపడే మంచి ఆహారం తీసుకోవాలని సూచించారు.
సమయానికి భోజనం చేయడం, తగిన నిద్ర, ప్రతిరోజూ కొంతసేపు వ్యాయామం, ధ్యానం చేయడం వంటి మంచి అలవాట్లు పెంపొందించుకోవాలని తెలిపారు.
లైఫ్ స్టైల్ మేనేజ్‌మెంట్ ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవడంతో పాటు ఆరోగ్యకరమైన జీవితం గడపవచ్చని ఆయన పేర్కొన్నారు.
కార్మికులు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం ద్వారా కుటుంబానికి, సమాజానికి ఆదర్శంగా నిలవగలరని అన్నారు.
మానసిక సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ సాధారణ వైద్య శాలలోని మైండ్ కేర్ అండ్ కౌన్సిలింగ్ సెంటర్ లో సంప్రదించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మైండ్ కేర్ సెంటర్ సిబ్బంది కొండ ఉమ, బూర శ్రీమతి, రాపెల్లి లత, పలువురు కార్మికులు పాల్గొని ఆరోగ్యకరమైన జీవన విధానం మరియు లైఫ్ స్టైల్ మేనేజ్‌మెంట్ పై అవగాహన పొందారు.