| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

సీనియర్ నాయకులు నారెడ్డి మోహన్ రెడ్డి మృతి పట్ల షబ్బీర్ అలీ సంతాపం

సీనియర్ నాయకులు నారెడ్డి మోహన్ రెడ్డి మృతి పట్ల షబ్బీర్ అలీ సంతాపం

డైలీ భారత్, కామారెడ్డి: మాజీ జెడ్పిటిసి, పోసానిపేట వాస్తవ్యులు మరియు కాంగ్రెస్ పార్టీ నమ్మకమైన సీనియర్ నాయకులు నారెడ్డి మోహన్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించడం అత్యంత బాధాకరమని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ఆవేదన వ్యక్తం చేశారు.

​ఈ దురదృష్టకర వార్త తెలిసిన వెంటనే షబ్బీర్ అలీ తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. మోహన్ రెడ్డి తో ఉన్న దశాబ్దాల అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ, పార్టీకి ఆయన చేసిన సేవలు వెలకట్టలేనివని కొనియాడారు.

​"మోహన్ రెడ్డి గారి మరణం కాంగ్రెస్ పార్టీకి, వ్యక్తిగతంగా నాకు తీరని లోటు. నిరంతరం ప్రజల కోసం పరితపించే గొప్ప నాయకుడిని మనం కోల్పోయాము. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను

మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులకు ఈ కష్ట సమయంలో దైవం ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుతూ, వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కామారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు ఈ విషాద సమయంలో వారి కుటుంబానికి అండగా ఉంటాయని భరోసా ఇచ్చారు.

Previous ZPHS గాంధారి పాఠశాల లో పదవతరగతి చదివే విద్యార్థుల తల్లిదండ్రులకు విజ్ఞప్తి
Next స్కూలుకు "తాళం"... విద్యార్థుల "ఆక్రందన"
ADVERTISEMENT