| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మాచారెడ్డి ఫారెస్ట్ రేంజ్ కార్యాలయాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

మాచారెడ్డి ఫారెస్ట్ రేంజ్ కార్యాలయాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

డైలీ భారత్, కామారెడ్డి: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మంగళవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాచారెడ్డి ఫారెస్ట్ రేంజ్ కార్యాలయాన్ని సందర్శించారు

అటవీ శాఖలో నిర్వహించే అన్ని కార్యకలాపాలను అటవీ అధికారులు కలెక్టర్ కి ప్రదర్శించగా, గ్రామీణ అటవీ ప్రాంతాల్లో లభ్యమయ్యే స్థానిక వృక్ష జాతులు, అడవి జంతువుల పాదముద్రలు (పగ్ మార్క్స్), మల అవశేషాలు (స్కాట్స్) , ఇతర గుర్తులను వివరించారు. అదేవిధంగా అటవీ శాఖలోని కార్యకలాపాల ఫోటోలు ప్రదర్శించి, అటవీ అగ్నిప్రమాదాలను నియంత్రించడానికి ఉపయోగించే ఫైర్ ఎక్విప్‌మెంట్ , అగ్నిప్రమాదాల నియంత్రణ విధానాలను వివరించారు.

కలెక్టర్  ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ, గ్రామీణ అటవీ ప్రాంతాల్లో అడివి సంరక్షణ,  భద్రతకు అటవీ అధికారులు,  ప్రజా భాగస్వామ్యంపై దృష్టి పెట్టాలన్నారు. అదేవిధంగా అటవీ కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా ప్రజలకు మరింత లాభాలు చేకూరుస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమం లో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Previous శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయంలో అన్నప్రసాద విఠరణ
Next ఘనంగా పదవ తరగతి విద్యార్థులకు వీడ్కోలు
ADVERTISEMENT