| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ప్రజల మధ్యకు వచ్చి సమస్యలు తెలుసుకున్న విద్యుత్ శాఖ అధికారులు

ప్రజల మధ్యకు వచ్చి సమస్యలు తెలుసుకున్న విద్యుత్ శాఖ అధికారులు

డైలీ భారత్, రామంతపూర్: రామంతపూర్ భగయత్ వెంకట సాయి నగర్‌ కాలనీ లో నిర్వహించిన  బస్తి బాట కార్యక్రమంలో ఏ డి ఈ రవీందర్ మరియు ఏ ఈ కిరణ్ కుమార్ కాలనీ లో పర్యటించారు. ఈ సందర్భంగా వారు కాలనీ ప్రజల విద్యుత్ సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించి, వినియోగదారుల ఫిర్యాదులను అడిగి తెలుసుకున్నారు.

సన్నగా మారిన కండక్టర్ వైర్‌లను భద్రతా కేబుల్ వైర్‌తో భర్తీ చేయడం తో పాటు, కాలనీలో ఉన్న లో వోల్టేజ్ సమస్యలను కూడా త్వరితగతిన పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ప్రజలకు ఎలాంటి విద్యుత్ అంతరాయం లేకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.


ప్రజలకు ఏ సమయంలోనైనా విద్యుత్ సమస్యల పరిష్కారం అందేలా విద్యుత్ శాఖ అధికారులు అందుబాటులో ఉంటారని ఏ డి ఈ రవీందర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు ఆర్ గోవింద్, రామకృష్ణ, నవీన్, తదితరులు పాల్గొన్నారు

Previous “LSRW" నైపుణ్యాలతో ఆంగ్ల భాషలో అద్బుత అవకాశాలు
Next ప్రతి కార్యాలయం పరిశుభ్రంగా ఉండాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్
ADVERTISEMENT