| Daily భారత్
Logo




“LSRW" నైపుణ్యాలతో ఆంగ్ల భాషలో అద్బుత అవకాశాలు

News

Posted on 2026-03-09 20:25:04

Share: Share


“LSRW" నైపుణ్యాలతో ఆంగ్ల భాషలో అద్బుత అవకాశాలు

డైలీ భారత్, గంభీరావుపేట: గంభీరావుపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థుల ఆంగ్ల భాషా నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి LSRW (Listening, Speaking, Reading, Writing) అంశంపై విస్తరణ ఉపన్యాస కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెట్పల్లి వాగ్దేవి డిగ్రీ కళాశాల ఆంగ్ల విభాగ ఉపన్యాసకులు బి. రాజు ముఖ్య వక్తగా పాల్గొన్నారు.

కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ వి. విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి డాక్టర్ యెలగొండ అంజనేయులు, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ ఇంగ్లీష్, డిపార్ట్మెంట్ ఇంచార్జీ నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా బి. రాజు మాట్లాడుతూ ఆంగ్ల భాషను సమర్థవంతంగా నేర్చుకోవడానికి Listening, Speaking, Reading, Writing అనే నాలుగు ప్రధాన నైపుణ్యాలు ఎంతో అవసరమని తెలిపారు. విద్యార్థులు ప్రతిరోజూ చదవడం, వినడం, మాట్లాడడం మరియు రాయడం వంటి అలవాట్లను పెంపొందించుకోవడం ద్వారా ఆంగ్ల భాషపై పట్టు సాధించవచ్చని సూచించారు.

ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగ అవకాశాలను పొందడానికి కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఎంతో ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. 

ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ వి. విజయలక్ష్మి మాట్లాడుతూ విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. డాక్టర్ యెలగొండ . అంజనేయులు కూడా విద్యార్థులు భాషా నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో కళాశాల ఆంగ్ల అధ్యాపకురాలు డి. రమ్య, వాణి, డాక్టర్ శ్రవణ్ కుమార్, ఆది విష్ణు, మనోహర్, శ్రీనివాస్, సుచరణ్, భిక్షమయ్య, దీపిక, జగనాథం అధ్యాపక మరియు అధ్యాపకేతర బృందం, విద్యార్థినీ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

Image 1

వ్యర్థ పదార్థాలు, ప్లాస్టిక్ వస్తువులు రోడ్లపై వేయొద్దు - 14వ వార్డ్ కౌన్సిలర్ రాంశెట్టి హర్షిత

Posted On 2026-06-18 11:50:02

Readmore >
Image 1

విధుల్లో రాణిస్తూనే పిల్లల అభ్యన్నతికై కృషి చేయాలి : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్, ఐపిఎస్

Posted On 2026-06-17 19:36:50

Readmore >
Image 1

సిరిసిల్లలో లాయడ్ గ్యాలరీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఫర్నిచర్ షోరూమ్ ప్రారంభం

Posted On 2026-06-17 19:30:07

Readmore >
Image 1

ప్రైవేట్ పాఠశాలలలో పాఠ్యపుస్తకాల విక్రయాలు ఆపివేయాలి : టిఎన్ఎస్ఎఫ్..టిజెఎస్

Posted On 2026-06-17 19:25:04

Readmore >
Image 1

తాడ్వాయి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

Posted On 2026-06-17 19:23:26

Readmore >
Image 1

జూలూరుపాడు ఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన జీనత్ కుమార్

Posted On 2026-06-17 19:21:57

Readmore >
Image 1

అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ ను పరామర్శించిన పవన్ కళ్యాణ్

Posted On 2026-06-17 13:12:03

Readmore >
Image 1

రెయిన్ బో చిల్డ్రన్స్ హాస్పిటల్ లో అగ్ని ప్రమాదం

Posted On 2026-06-17 12:56:45

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన గ్రామపంచాయతీ కార్యదర్శి

Posted On 2026-06-17 12:51:22

Readmore >
Image 1

గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ చేసిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్

Posted On 2026-06-17 08:58:29

Readmore >