| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్ ర్యాలీ

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్ ర్యాలీ

డైలీ భారత్, కామారెడ్డి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళితులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా  జాయింట్ కలెక్టర్ విక్టర్ గారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జిల్లా అధ్యక్షులు రూసేగం భూమయ్య మాట్లాడుతూ మెడిపపన్న ఆదేశాల మేరకు అన్ని కలెక్టర్ కార్యాలయం ర్యాలీ నిర్వహించడం జరిగిందని, తెలిపారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళితులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం దళితులకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అభయాసం పథకం ద్వారా ప్రతి దళిత కుటుంబానికి 12 లక్షల రూపాయలు ఆర్థిక సాయం తక్షణమే అందించాలని, అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి మూడు ఎకరాల సాగుభూమి కేటాయించాలని జీవో నెంబర్ 58.59 ప్రకారం అసైన్మెంట్ భూములను పట్టచేసి అమ్ముకొనుటకు హక్కు కల్పించాలని, ఇందిరమ్మ ఇల్లు కొరకు ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నారని, దానితోపాటు ఇసుక, సిమెంట్ ఎస్సీలకు ఉచితంగా ఇవ్వాలని, స్థలం లేని వారికి ప్రభుత్వ స్థలం కేటాయించాలని, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్టు ప్రకారం ఎస్సీలకు కూడా పోడు భూములను వర్తింపజేయాలని, విద్యకు చట్టం ప్రకారం కార్పొరేట్ విద్యా సంస్థలలో 25 శాతం ఉచిత విద్యను కచ్చితంగా అమలు చేయాలని, ఎస్సీ కార్పొరేషన్ శాఖకు 15వేల కోట నిధులు కేటాయించి సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని, పరిశుద్ధ కార్మికులకు నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించి వారికి 20 వేల రూపాయలు కనీస వేతనం ఇవ్వాలని, తోళ్ల పరిశ్రమకు 10 వేల కోట్ల రూపాయలు నిధులు కేటాయించి, లీడ్ క్యాప్ భూములను  పరిరక్షించుటకు, చైర్మన్ నియమించి తోళ్ల  పరిశ్రమ ఏర్పాటు చేయాలని మాదిగ యువతకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు.

Previous మద్యం మత్తులో వాహనం నడిపితే… జైలు జీవితం తప్పదు!
Next కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల క్షేత్రంలో శ్రీవారిని దర్శించుకున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు
ADVERTISEMENT