డైలీ భారత్, కామారెడ్డి: SHG మహిళలకు మూడు రంగాలలో విశేష ప్రతిభ కనబర్చినందుకు 8th మార్చ్ హైదరాబాద్ లో మంత్రుల చేతుల మీదుగా సన్మానం , ప్రశంసా పత్రాలు అందుకున్న కామారెడ్డి మహిళ సంఘాల సభ్యులు
దోమకొండ మండలంలో మహిళా రైతు ఉత్పత్తిదారుల సంఘాల ద్వారా ఏర్పడిన మహిళా రైతు ఉత్పత్తిదారుల కంపెనీ రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు గాను కంపెనీ చైర్మన్ శ్రీమతి పన్యాల స్వరూప ను రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అధికారులు సన్మానించడం జరిగింది.
కామారెడ్డి మండలం కోటాలపల్లి గ్రామానికి చెందిన శ్రీమతి దేవేంద్ర కళాత్మక డెకరేటింగ్ వస్తువుల తయారీలో ఉత్తమ ఎంటర్‌ప్రెన్యూర్‌గా హైదరాబాద్‌లో వైద్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సన్మానం పొందారు.
బీబీపేట గ్రామానికి చెందిన 10 మంది సభ్యులు కలిసి "క్షీర సాగర డైరీ"ను ప్రారంభించి అధిక ఆదాయం పొందుతున్నందుకు గాను వారిని HYD Biz TV వారు సన్మానించారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా నుండి రాష్ట్ర స్థాయిలో విశేష ప్రతిభ కనబరిచిన మహిళా సంఘాల సభ్యులు సోమవారం జిల్లా కలెక్టర్
ను మర్యాద పూర్వకంగా కలసి సందర్భంలో జిల్లా కలెక్టర్ వారిని అభినందిస్తూ మహిళలు ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలని సూచించారు. మహిళల అభివృద్ధికి జిల్లా పరిపాలన తరఫున అన్ని విధాల సహకారం అందిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో DRDO సురేందర్ , DPM లు శ్రీనివాస్ , సురేష్ , RM కిరణ్ , జిల్లా సమాఖ్య ప్రతినిధులు , ఇతర అధికారులు పాల్గొన్నారు