| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కన్నకొడుకు గెంటేశాడు.. జిల్లా కలెక్టర్ కొడుకులా కాపాడారు..

కన్నకొడుకు గెంటేశాడు.. జిల్లా కలెక్టర్ కొడుకులా కాపాడారు..

డైలీ భారత్, కావలి: కావలికి చెందిన రమాజ్యోతి అనే వృద్ధురాలిని ఆమె కన్న కొడుకే ఇల్లు రాయించుకొని బయటకు గెంటేశాడు. తనను మభ్యపెట్టి తాను నివసిస్తున్న ఇంటిని తన పేరు మీద రాయించుకుని.. తనను ఇంటి నుంచి వెళ్ళగొట్టాడని, నిలువ నీడ లేకుండా చేశాడని ఆ వృద్ధురాలు నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లాకు గ్రీవెన్స్ లో మొరపెట్టుకుంది.  దీంతో నెల్లూరు జిల్లా కలెక్టర్ .. మానవీయ దృక్పథంతో స్పందించి.. వెంటనే పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. చట్ట ప్రకారం రిజిస్ట్రేషన్ ను రద్దుచేసి.. ఆమె ఇంటిని ఆమెకు గౌరవంగా జిల్లా కలెక్టర్ అప్పగించారు. దీంతో తన కుమారుడి నుంచి తన ఇంటిని తనకు ఇప్పించి సమస్య పరిష్కరించిన జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లను స్వయంగా కలిసి, వృద్ధురాలు రమాజ్యోతి కృతజ్ఞతలు తెలిపారు.

Previous మస్జీద్ కాంప్లెక్స్‌లోని షాప్ నెంబర్ 5 కేటాయింపును వెంటనే రద్దు చేయాలి
Next ఓంకారేశ్వర ఆలయ నాలుగవ వార్షికోత్సవం
ADVERTISEMENT