Posted on 2026-02-20 05:26:35
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణరాష్ట్రంలో ప్రజాపాలన కాదు, రాక్షస పాలన కొనసాగుతోందని వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు తీవ్రంగా విమర్శించారు.మాజీ ప్రభుత్వ విప్ చెన్నూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు బాల్క సుమన్ అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేయడాన్ని ఆయన ఘాటుగా ఖండించారు.
మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల మద్దతు లేక అడ్డదారుల్లో గెలవాలనే కుట్ర బుద్ధితో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు.
మంత్రి వివేక్ అక్రమాలకు అడ్డుపడ్డ బాల్క సుమన్‌ను లక్ష్యంగా చేసుకుని తప్పుడు కేసులు నమోదు చేసి చిత్రహింసలకు గురి చేయడం ప్రజాస్వామ్య విలువలకు తూట్లు పొడవడమేనని మండిపడ్డారు.ఇలాంటి దమనకాండకు పాల్పడుతున్న కాంగ్రెస్ పార్టీకి చెన్నూరు ప్రజలు తప్పకుండా గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.వివేక్ ఎన్ని కుట్రలు చేసిన క్యాతనపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కూటమి విజయకేతనం ఎగురవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.అక్రమంగా అరెస్టు చేసిన బాల్క సుమన్‌ను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర
Posted On 2026-08-03 18:44:40
Readmore >
వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్
Posted On 2026-08-03 16:58:20
Readmore >
వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ
Posted On 2026-08-03 14:31:13
Readmore >
60 వేలు ఇచ్చి వివాహం చేసు కున్నాడు...తెల్లారే సరికి పెట్టె బేడా సర్దుకుని ఊడయించిన నవవధువు
Posted On 2026-08-03 05:55:39
Readmore >
ప్రతి ఇంట్లో తెలిసి ఉండాల్సిన 25 ముఖ్యమైన మందులు – ఉపయోగాలు, జాగ్రత్తలు
Posted On 2026-08-03 05:54:41
Readmore >
అంగరంగ వైభవంగా పాపకొల్లు గ్రామంలో ఆషాడ మాస బోనాల పండుగ కార్యక్రమం
Posted On 2026-08-03 05:49:18
Readmore >