| Daily భారత్
Logo




శిక్షణ పూర్తి చేసుకొని జిల్లాకు కేటాయించబడిన రెండు పోలీస్ జాగీలాలను అభినందించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు

News

Posted on 2026-02-20 05:25:08

Share: Share


శిక్షణ పూర్తి చేసుకొని జిల్లాకు కేటాయించబడిన రెండు పోలీస్ జాగీలాలను అభినందించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ రాష్ట్రంఎనిమిది నెలల పాటు IITA,మొయినాబాద్ నందు బేసిక్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని జిల్లాకు కేటాయించబడిన పోలీస్ జాగిలాలు షైనీ,లైకా లను గురువారం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తన కార్యాలయంలో ప్రత్యేకంగా అభినందించారు.ప్రేలుడు పదార్థాలను కనుగొనడంలో ప్రత్యేకంగా శిక్షణ పొందిన ఈ రెండు జాగిలాలు జిల్లా పోలీస్ శాఖలో సేవలందించేందుకు రావడం సంతోషకరమన్నారు.పోలీస్ జాగిలం షైనీ కు హ్యాండ్లర్ గా వ్యవహారిస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ లాల్ సింగ్,లైకా కు హ్యాండ్లర్ గా వ్యవహారిస్తున్న కే.ముత్తయ్య,ఇతర డాగ్ స్క్వాడ్ అధికారులు,సిబ్బందికి ఈ సందర్బంగా ఎస్పీ పలు సూచనలు చేశారు.ప్రస్తుతం జిల్లా పోలీస్ శాఖలో పనిచేస్తున్న 12 పోలీస్ జాగిలాలకు సంబంధించి పూర్తి వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. జాగిలాల సంరక్షణ,వసతి ఏర్పాట్లలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్,అడ్మిన్ ఆర్ఐ లాల్ బాబు,ఎంటిఓ సుధాకర్,తదితరులు పాల్గొన్నారు.

Image 1

170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర

Posted On 2026-08-03 18:44:40

Readmore >
Image 1

వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్

Posted On 2026-08-03 16:58:20

Readmore >
Image 1

వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ

Posted On 2026-08-03 14:31:13

Readmore >
Image 1

చంద్రంపేట ఉన్నత పాఠశాలలో అత్యంత వైభవంగా బోనాల పండుగ

Posted On 2026-08-03 14:16:26

Readmore >
Image 1

హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్ "సామాజిక న్యాయ తెలంగాణ – సంకల్ప సభ"

Posted On 2026-08-03 14:09:30

Readmore >
Image 1

చిట్టీల పేరుతో ఐదు కోట్ల రూపాయలు ముంచి పరార్

Posted On 2026-08-03 05:58:15

Readmore >
Image 1

60 వేలు ఇచ్చి వివాహం చేసు కున్నాడు...తెల్లారే సరికి పెట్టె బేడా సర్దుకుని ఊడయించిన నవవధువు

Posted On 2026-08-03 05:55:39

Readmore >
Image 1

ప్రతి ఇంట్లో తెలిసి ఉండాల్సిన 25 ముఖ్యమైన మందులు – ఉపయోగాలు, జాగ్రత్తలు

Posted On 2026-08-03 05:54:41

Readmore >
Image 1

అంగరంగ వైభవంగా పాపకొల్లు గ్రామంలో ఆషాడ మాస బోనాల పండుగ కార్యక్రమం

Posted On 2026-08-03 05:49:18

Readmore >
Image 1

బిజెపి నాయకత్వంపై నమ్మకంతో పనిచేస్తా... రమేష్ యాదవ్

Posted On 2026-08-02 15:18:04

Readmore >