Posted on 2026-02-18 16:27:28
28వ వార్డు లో యువ నేత కబీర్ ఆధ్వర్యంలో నూతన పాలక వర్గానికి ఘన సన్మానం
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా :పట్టణంలోని ప్రతి వార్డులో మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా పనిచేస్తామని మున్సిపల్ చైర్మన్ అగ్గనూరు బస్వం అన్నారు. బుధవారం పట్టణంలోని 28వ వార్డులో యువ నేత కబీర్ ఆధ్వర్యంలో భాగ్యలక్ష్మి అధ్యక్షతన నూతన మున్సిపల్ పాలక వర్గానికి ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. చైర్మన్ బస్వం, కౌన్సిలర్లు రిజ్వనాబేగం ముబారక్, పెంటయ్య, రాజు నాయక్, ప్రవీణ్, మరియాంబేగం సాధిక్, మురళి మోహన్ (అప్పి), బచ్చలి నరేష్, నజీయాబేగంసర్వర్ పాష, శిరీష అనిల్, దిలీప్ కుమార్ లను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం చైర్మన్ మాట్లాడుతూ... వార్డుల వారీగా ఉన్న సమస్యలను గుర్తించి ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. యువత, స్థానిక నాయకుల సహకారంతో వార్డులను అభివృద్ధి పథంలో నడిపిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా కబీర్ మాట్లాడుతూ...తమ వార్డు అభివృద్ధికి సహకరిస్తున్న పాలక వర్గానికి కృతజ్ఞతలు తెలుపుతూ, చైర్మన్ ఇతర సభ్యులను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ ఖాన్, సీనియర్ నాయకులు ఇబ్రహీం, మన్సుర్, మైనార్టీ సెల్ టౌన్ అధ్యక్షులు సఖిబ్, నాయకులు హలీం, జాఫర్ ఖాన్, శ్రీనివాస్ గౌడ్, శేఖర్ అప్ప, జలజ, నాగరాజు, జాహిర్ ఖాన్, ఆసిమ్, సురేష్, డాక్టర్ ప్రేమ్ కుమార్, పరమేశ్వర్, సురేష్, తిరుపతి రెడ్డి, ఇలియాజ్, కిరణ్, రఘు, కొన దేవయ్య కృష్ణ, నవనీత్, వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-08-04 14:15:02
Readmore >
వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు
Posted On 2026-08-04 14:13:47
Readmore >
"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-08-04 13:06:14
Readmore >
సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!
Posted On 2026-08-04 09:03:06
Readmore >
యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్
Posted On 2026-08-04 08:26:26
Readmore >
170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర
Posted On 2026-08-03 18:44:40
Readmore >
వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్
Posted On 2026-08-03 16:58:20
Readmore >
వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ
Posted On 2026-08-03 14:31:13
Readmore >