Posted on 2026-02-17 16:33:46
డైలీ భారత్ డెస్క్: దేశవ్యాప్తంగా రైతులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్ చెప్పబోతోంది. రైతులకు ప్రభుత్వం నుంచి అందించాల్సిన సమాచారాన్ని ఏఐ సాయంతో వారి సొంత భాషల్లోనే అందించేందుకు కేంద్రం ఓ భారీ ప్రాజెక్టును చేపట్టబోతోంది.
దీనిపై ఇప్పటికే కేంద్ర బడ్జెట్ లో ప్రకటన చేసిన కేంద్రం.. రేపు దాన్ని అధికారికంగా ప్రారంభించేందుకు సిద్దమైంది. భారత్-విస్తార్ (Bharat-VISTAAR) పేరుతో ప్రారంభించబోతున్న ఈ ప్రాజెక్టు ఏఐ సాయంతో రైతులకు అవసరమైన ఎన్నో అంశాల్లో ఉపయోగపడనుంది.
రైతుల కోసం కేంద్రం ఏఐ టూల్ (Bharat-VISTAAR)
రైతులకు వారి స్వంత భాషలో సమాచారం అందించేందుకు కృత్రిమ మేథ ఆధారిత "భారత్-విస్తార్" (వర్చువల్లీ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ టు యాక్సెస్ అగ్రికల్చరల్ రిసోర్సెస్)ను కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రారంభించనుంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ కలిసి జైపూర్‌లో దీనిని ప్రారంభిస్తారు. ఈ టూల్ ప్రణాళిక, వ్యవసాయ పద్ధతులు, తెగుళ్ల నియంత్రణ, వాతావరణ అంచనాలు, మార్కెట్ ధరలు, ప్రభుత్వ పథకాల సమాచారం, అర్హతలు, దరఖాస్తు విధానం, ఫిర్యాదుల పరిష్కారం వంటి అనేక విషయాలపై రైతులకు మార్గదర్శనం చేస్తుంది. మొబైల్ లేదా సాధారణ ఫోన్ కాల్ ద్వారా దీన్ని యాక్సెస్ చేయవచ్చు
24 గంటలూ అందుబాటులో ఉండేలా
భారత్-విస్తార్ ఒక "డిజిటల్ వ్యవసాయ నిపుణుడు" గా రోజుకు 24 గంటలు అందుబాటులో ఉంటుంది. రైతులు 155261 నంబర్‌కు డయల్ చేయడం ద్వారా దీనిని వాడుకోవచ్చు. ఈ ప్లాట్‌ఫారమ్‌లోని ఏఐ సహాయకుడికి "భారతి" అని పేరు పెట్టారు. ఈ ప్రయోగం తర్వాత, రైతులు పీఎం-కిసాన్, పీఎం ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై), సాయిల్ హెల్త్ కార్డ్ (ఎస్‌హెచ్‌సీ), మోడిఫైడ్ ఇంట్రెస్ట్ సబ్‌వెన్షన్ స్కీమ్, సబ్-మిషన్ ఆన్ అగ్రికల్చరల్ మెకనైజేషన్, పర్ డ్రాప్ మోర్ క్రాప్, పీఎం కృషి సించాయి యోజన, పీఎం అన్నదాత ఆయ్ సంరక్షణ అభియాన్, అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్, కిసాన్ క్రెడిట్ కార్డ్ వంటి పది ప్రధాన కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి వివరణాత్మక సమాచారం పొందవచ్చు.
బడ్జెట్లో 150 కోట్ల నిధుల కేటాయింపు
అంతేకాకుండా వాతావరణ పరిస్థితులు, తెగుళ్ల వ్యాప్తికి సంబంధించిన ముఖ్యమైన హెచ్చరికలు కూడా ఈ యాప్ సాయంతో సకాలంలో రైతులకు అందుతాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 కేంద్ర బడ్జెట్‌లో "భారత్-విస్తార్" ప్రాజెక్టును ప్రకటించారు. ఇది వ్యవసాయ ఉత్పాదకతను పెంచుతుందని, రైతులకు మెరుగైన నిర్ణయాలు తీసుకోవడానికి వీలు కల్పిస్తుందని, పర్సనలైజ్డ్ సలహా మద్దతును అందించడం ద్వారా ప్రమాదాల్ని తగ్గిస్తుందని నిర్మాల సీతారామన్ తెలిపారు. ఈ ప్రాజెక్ట్ కోసం కేంద్రం వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.150 కోట్లు కేటాయించింది.
పండరి – స్వరూప కుటుంబానికి శ్రీ మాత సేవ చారిటబుల్ ట్రస్ట్ అండ
Posted On 2026-08-05 17:07:25
Readmore >
ఒక్క నంబర్‌తో 18 సేవలు... తెలంగాణలో డయల్ 112 లాంఛ్ చేసిన DGP సి.వి. ఆనంద్
Posted On 2026-08-05 14:58:50
Readmore >
దుబాయ్‌లో హై అలర్ట్... 20 నిమిషాల వ్యవధిలో 7 భారీ పేలుళ్లు... క్షిపణి దాడులా? ప్రమాదమా?
Posted On 2026-08-05 13:28:01
Readmore >
కామారెడ్డి : ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠా కీలక నిందితుడు అరెస్ట్ - iPhone స్వాధీనం
Posted On 2026-08-05 13:09:21
Readmore >
ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-08-04 14:15:02
Readmore >
వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు
Posted On 2026-08-04 14:13:47
Readmore >
"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-08-04 13:06:14
Readmore >
సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!
Posted On 2026-08-04 09:03:06
Readmore >
యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్
Posted On 2026-08-04 08:26:26
Readmore >