| Daily భారత్
Logo




హుజూర్ నగర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా గెల్లి రవి నియామకం

News

Posted on 2026-02-16 14:18:02

Share: Share


హుజూర్ నగర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా గెల్లి రవి నియామకం

డైలీ భారత్, హుజూర్ నగర్: కాంగ్రెస్ పార్టీ పట్టణ నూతన అధ్యక్షుడిగా గెల్లి రవి ఎన్నిక కావడం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఆయన నాయకత్వంలో పట్టణ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని నాయకులు మరియు కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ పట్టణ నూతన అధ్యక్షుడు గెల్లి రవి మాట్లాడుతూ... ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడం వంటి అంశాలను ప్రధాన లక్ష్యాలుగా తీసుకొని పనిచేస్తామని  తెలిపారు. పార్టీ కార్యకర్తలందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి కాంగ్రెస్ పార్టీని పట్టణంలో మరింత బలపరుస్తామని ఆయన హామీ ఇచ్చారు.పార్టీ కార్యకర్తలంతా ఐక్యంగా పనిచేస్తే పట్టణంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలపడుతుందని, భవిష్యత్తులో జరిగే  ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించేలా కృషి చేస్తామని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే విధంగా పారదర్శక రాజకీయాలు చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.ఈ సందర్భంగా పార్టీ నాయకులు కార్యకర్తలు గెల్లి రవికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన నాయకత్వంలో పట్టణంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Image 1

తాడ్వాయి మండలంలోని కరడ్‌పల్లిలో కల్తీ కల్లు విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్

Posted On 2026-08-06 18:26:12

Readmore >
Image 1

పెద్ద చెరువును పరిశీలించిన జిల్లా ఎస్పీ

Posted On 2026-08-05 17:08:38

Readmore >
Image 1

పండరి – స్వరూప కుటుంబానికి శ్రీ మాత సేవ చారిటబుల్ ట్రస్ట్ అండ

Posted On 2026-08-05 17:07:25

Readmore >
Image 1

ఒక్క నంబర్‌తో 18 సేవలు... తెలంగాణలో డయల్ 112 లాంఛ్ చేసిన DGP సి.వి. ఆనంద్

Posted On 2026-08-05 14:58:50

Readmore >
Image 1

దుబాయ్‌లో హై అలర్ట్... 20 నిమిషాల వ్యవధిలో 7 భారీ పేలుళ్లు... క్షిపణి దాడులా? ప్రమాదమా?

Posted On 2026-08-05 13:28:01

Readmore >
Image 1

కామారెడ్డి : ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠా కీలక నిందితుడు అరెస్ట్ - iPhone స్వాధీనం

Posted On 2026-08-05 13:09:21

Readmore >
Image 1

ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-08-04 14:15:02

Readmore >
Image 1

వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు

Posted On 2026-08-04 14:13:47

Readmore >
Image 1

"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-08-04 13:06:14

Readmore >
Image 1

సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!

Posted On 2026-08-04 09:03:06

Readmore >