| Daily భారత్
Logo




హుజూర్ నగర్ మున్సిపల్ పీఠంపై చైర్మన్‌గా దొంతగాని శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్‌గా తన్నీరు మల్లికార్జున్ రావు

News

Posted on 2026-02-16 14:11:07

Share: Share


హుజూర్ నగర్ మున్సిపల్ పీఠంపై చైర్మన్‌గా దొంతగాని శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్‌గా తన్నీరు మల్లికార్జున్ రావు

డైలీ భారత్, హుజూర్ నగర్: హుజూర్ నగర్ మున్సిపల్ నూతన చైర్మన్‌ మరియు వైస్ చైర్మన్‌ ఎన్నిక  పూర్తయింది చైర్మన్‌ అభ్యర్థిగా దొంతగాని శ్రీనివాస్ గౌడ్ పేరును 21వ వార్డు కౌన్సిలర్ తన్నీరు మల్లికార్జున్ రావు ప్రతిపాదించిగా 23వార్డు కౌన్సిలర్ అట్లూరి మంజుల బలపర్చారు. ఇతరులెవ్వరు పోటీలో లేని కారణంగా దొంతగాని శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక ఏకగ్రీవమైంది. దీంతో హుజూర్ నగర్ మున్సిపాలిటీ నూతన చైర్మన్‌గా దొంతగాని శ్రీనివాస్ గౌడ్ ఎన్నికయ్యారు. 

అనంతరం మున్సిపల్ వైస్ చైర్మన్‌గా తన్నీరు మల్లికార్జున్ రావు పేరును 28వ వార్డు కౌన్సిలర్ నందిగామ శ్రీనివాస్ ప్రతిపాదించగా 27వ వార్డు కౌన్సిలర్ తండు ప్రసాద్ బలపర్చారు. పోటీలో ఇతరులెవ్వరు లేని కారణంగా తన్నీరు మల్లికార్జున్ రావు ఎన్నిక ఏకగ్రీవమవ్వగా హుజూర్ నగర్ మున్సిపాలిటీ నూతన వైస్ చైర్మన్‌గా తన్నీరు మల్లికార్జున్ రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

హుజూర్ నగర్ మున్సిపల్ చైర్మన్ పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ...విజయం కేవలం వ్యక్తిగత గెలుపు కాదని ప్రజలు ఇచ్చిన రాజకీయ తీర్పు అని శ్రీనివాస్ అన్నారు. ఈ ఫలితం స్థానిక రాజకీయాల్లో స్పష్టమైన మార్పుకు సంకేతమని ప్రజలు అభివృద్ధి మరియు బాధ్యతాయుతమైన పాలనకే మద్దతు ఇచ్చారని తెలిపారు. మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధి ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన మరియు పారదర్శక పరిపాలన తమ ప్రధాన లక్ష్యమని ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునే విధంగా ప్రతి నిర్ణయం తీసుకుంటామని  దొంతగాని  తెలిపారు.

Image 1

తాడ్వాయి మండలంలోని కరడ్‌పల్లిలో కల్తీ కల్లు విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్

Posted On 2026-08-06 18:26:12

Readmore >
Image 1

పెద్ద చెరువును పరిశీలించిన జిల్లా ఎస్పీ

Posted On 2026-08-05 17:08:38

Readmore >
Image 1

పండరి – స్వరూప కుటుంబానికి శ్రీ మాత సేవ చారిటబుల్ ట్రస్ట్ అండ

Posted On 2026-08-05 17:07:25

Readmore >
Image 1

ఒక్క నంబర్‌తో 18 సేవలు... తెలంగాణలో డయల్ 112 లాంఛ్ చేసిన DGP సి.వి. ఆనంద్

Posted On 2026-08-05 14:58:50

Readmore >
Image 1

దుబాయ్‌లో హై అలర్ట్... 20 నిమిషాల వ్యవధిలో 7 భారీ పేలుళ్లు... క్షిపణి దాడులా? ప్రమాదమా?

Posted On 2026-08-05 13:28:01

Readmore >
Image 1

కామారెడ్డి : ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠా కీలక నిందితుడు అరెస్ట్ - iPhone స్వాధీనం

Posted On 2026-08-05 13:09:21

Readmore >
Image 1

ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-08-04 14:15:02

Readmore >
Image 1

వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు

Posted On 2026-08-04 14:13:47

Readmore >
Image 1

"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-08-04 13:06:14

Readmore >
Image 1

సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!

Posted On 2026-08-04 09:03:06

Readmore >