Posted on 2026-02-10 15:17:37
30 తులాల వెండి ఆభరణాలు రికవరీ
వివరాలు వెల్లడించిన వేములవాడ రూరల్ సి.ఐ శ్రీనివాస్.
డైలీ భారత్, వేములవాడ: బోయినపల్లి మండలం వరదవెల్లి గ్రామానికి చెందిన కొంకటి తిరుపతి ఇంట్లో తేదీ 07.02.2026 తెల్లవారు జామున గుర్తు తెలియని వ్యక్తులు తాళం పగులగొట్టి ఇంట్లోకి చొరబడి వెండి పూజా వస్తువులను దొంగిలించగా కొంకటి తిరుపతి బోయినపల్లి పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేయగా ఎస్.ఐ రమాకాంత్ కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా సంఘటనా స్థలంలో సాక్ష్యాల ఆధారంగా నిందుతులు సిద్దిపేట జిల్లా,చేర్యాల మండలం,ముస్త్యాల గ్రామనికి చెందిన కంచు శివ శంకర్ మరియు సంజీవయ్య నగర్, సిరిసిల్ల, ప్రస్తుతం వేములవాడ సుబాష్‌నగర్ చెందిన
సామల్ల బాలకిషన్ గా గుర్తించడం జరిగిందని, వీరిని పట్టుకువడానికి బోయినపల్లి ఎస్.ఐ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టగా సాంకేతికత ఆధారంగా నిందుతులను ఈరోజు కోదురుపాక చౌరస్తా వద్ద బస్సు కోసం వేచి ఉండగా అదుపులోకి తీసుకొని వారి వద్ద 30 తులాల వెండి ఆభరణాలు, స్వాధీనం చేసుకొని రిమాండ్ కి తరలించడాం జరిగిందన్నారు.
నిందుతుల వివరాలు...
A-1 కంచు శివ శంకర్, తండ్రి కృష్ణ, వయసు 20 సంవత్సరాలు, వృత్తి: మొబైల్ రిపేర్ షాప్‌లో పని,ముస్త్యాల గ్రామం, చేర్యాల మండలం, సిద్దిపేట జిల్లా.
A-2 సామల్ల బాలకిషన్, తండ్రి దేవయ్య, వయసు 30 సంవత్సరాలు, వృత్తి: టీ స్టాల్ నిర్వహణ, సంజీవయ్య నగర్, సిరిసిల్ల, ప్రస్తుతం వేములవాడ సుబాష్‌నగర్.
త్వరితగతిన కేసు చేధించిన ఎస్.ఐ రమాకాంత్, ప్రింగర్ ప్రింట్ ఎస్.ఐ క్రాంతి, సిబ్బంది కోటి, లక్ష్మీనారాయణ, సుధాకర్, వెంకటేష్ లను వేములవాడ రూరల్ సి.ఐ ప్రత్యేకంగా అభినందించారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,గ్రామాలలో ఎటువంటి అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఆయన కోరారు.
వాహనదారుల భద్రతే లక్ష్యం... సూర్యాపేట జాతీయ రహదారిపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు
Posted On 2026-08-07 16:00:29
Readmore >
చీరాల వేదికగా "నేతన్న నేస్తం" ఐదో విడత నిధులు విడుదల చేసిన సీఎం చంద్రబాబు...
Posted On 2026-08-07 15:27:03
Readmore >
కామారెడ్డి : ప్రతి పిటిషన్లపై తక్షణ స్పందన – CCTNSలో వెంటనే నమోదు చేసి రశీదు ఇవ్వాలి
Posted On 2026-08-07 14:58:17
Readmore >
పర్యావరణ పరిరక్షణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-08-07 14:53:14
Readmore >
హనుమకొండ : డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు సిద్ధం చేయండి
Posted On 2026-08-07 12:07:52
Readmore >