Posted on 2026-02-10 03:39:21
డైలీ భారత్, కేరళ డెస్క్: సంకల్పం ఉంటే వైకల్యం అడ్డురాదని నిరూపించారు కేరళకు చెందిన 24 ఏళ్ల తాన్యా నాథన్ . దేశంలోనే తొలి అంధ మహిళా న్యాయమూర్తిగా త్వరలోనే ఆమె బాధ్యతలు స్వీకరించనున్నారు. సోమవారం వెలువడిన కేరళ లా సర్వీసెస్ ఎగ్జామ్స్లో విజువల్లీ ఛాలెంజడ్ అభ్యర్థిగా ఆమె ఘన విజయం సాధించారు.సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) పరీక్షల్లో దివ్యాంగుల కోటాలో తన్యా నాథన్ మొదటి ర్యాంకు సాధించారు. వంద శాతం దృష్టి లోపం ఉన్న ఆమె, కన్నూర్ విశ్వవిద్యాలయం నుంచి ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసి ప్రథమ ర్యాంకుతో పట్టభద్రులయ్యారు. అంతకుముందు, కన్నూర్ జిల్లాలోని తలిపరంబలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు.. అనంతరం జడ్జి కావాలనే లక్ష్యంతో లా పరీక్షలకు హాజరయ్యారు.కాగా, వైకల్యం శరీరానికే కానీ, మనసుకు కాదంటూ.. అంధ అభ్యర్థులు న్యాయసేవలకు అర్హులేనని గతేడాది సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. కొన్ని రాష్ట్రాల్లో దివ్యాంగులకు న్యాయసేవల్లో రిజర్వేషన్లు నిరాకరించిన అంశంపై దాఖలైన పిటిషన్లతో పాటు ఒక సుమోటో కేసును కూడా కోర్టు విచారించింది. ఆ సందర్భంగా దివ్యాంగులు న్యాయసేవల్లో ఎలాంటి వివక్షకు గురికాకూడదని, సమగ్ర వ్యవస్థ ఏర్పాటుకు రాష్ట్రాలు సానుకూల చర్యలు తీసుకోవాలని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ‘వైకల్యం కారణంగా ఏ అభ్యర్థికీ అవకాశాన్ని నిరాకరించలేం’ అని పేర్కొంటూ తీర్పు వెలువరించింది.ఈ క్రమంలో ఏడాది లోపే తన్యా నాథన్ జడ్జి పరీక్షల్లో విజయం సాధించి, త్వరలో న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించనుండడం విశేషం.
వాహనదారుల భద్రతే లక్ష్యం... సూర్యాపేట జాతీయ రహదారిపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు
Posted On 2026-08-07 16:00:29
Readmore >
చీరాల వేదికగా "నేతన్న నేస్తం" ఐదో విడత నిధులు విడుదల చేసిన సీఎం చంద్రబాబు...
Posted On 2026-08-07 15:27:03
Readmore >
కామారెడ్డి : ప్రతి పిటిషన్లపై తక్షణ స్పందన – CCTNSలో వెంటనే నమోదు చేసి రశీదు ఇవ్వాలి
Posted On 2026-08-07 14:58:17
Readmore >
పర్యావరణ పరిరక్షణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-08-07 14:53:14
Readmore >
హనుమకొండ : డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు సిద్ధం చేయండి
Posted On 2026-08-07 12:07:52
Readmore >