Posted on 2026-02-08 11:38:38
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దొంతిరెడ్డి పద్మ రాంరెడ్డి
డైలీ భారత్, హుజూర్ నగర్: హుజూర్ నగర్ మున్సిపల్ ఎన్నికల్లో తనని గెలిపిస్తే వార్డును మరింత అభివృద్ధి చేస్తానని 4వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని దొంతిరెడ్డి పద్మ రాంరెడ్డి అన్నారు. ఆదివారం హుజూర్ నగర్ పట్టణంలోని 4వ వార్డులో గడపగడపకు తిరుగుతూ మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా పద్మ రాంరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో అన్ని వర్గాల అభివృద్ధి సంక్షేమం ఉపాధి జరుగుతుందని అన్నారు.చేయి గుర్తుపై అమూల్యమైన ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో తనను గెలిపించాలని ప్రతి ఒక్కరిని కోరారు తాను నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు పరిష్కరిస్తామన్నారు. వార్డులో డ్రైనేజీ,సీసీ రోడ్లు, వీధిలైట్లు, మంచినీరు తదితర సమస్య లేకుండా కృషి చేస్తానన్నారు. ప్రజల రక్షణ కోసం వార్డులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. బూత్ కమిటీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సమిష్టిగా ప్రణాళికతో సైనికుల్లా పనిచేసి పార్టీ అభ్యర్థులను మరియు పార్టీ బలపరిచిన అభ్యర్థుల గెలుపు కొరకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మధిర ప్రతాప్ రెడ్డి, దాసా నాగేశ్వర్రావు, ఆంజనేయులు, శివ తదితరులు పాల్గొన్నారు.
రెంట్ ఎ బాయ్‌ఫ్రెండ్ "డేటింగ్ ట్రాప్".. అమ్మాయిలూ తస్మాత్ జాగ్రత్త... సీపీ సజ్జనార్
Posted On 2026-08-08 14:28:17
Readmore >
తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుండి కొత్త రేషన్ కార్డుల పంపిణీ!
Posted On 2026-08-08 04:36:39
Readmore >
వాహనదారుల భద్రతే లక్ష్యం... సూర్యాపేట జాతీయ రహదారిపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు
Posted On 2026-08-07 16:00:29
Readmore >
చీరాల వేదికగా "నేతన్న నేస్తం" ఐదో విడత నిధులు విడుదల చేసిన సీఎం చంద్రబాబు...
Posted On 2026-08-07 15:27:03
Readmore >
కామారెడ్డి : ప్రతి పిటిషన్లపై తక్షణ స్పందన – CCTNSలో వెంటనే నమోదు చేసి రశీదు ఇవ్వాలి
Posted On 2026-08-07 14:58:17
Readmore >
పర్యావరణ పరిరక్షణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-08-07 14:53:14
Readmore >