| Daily భారత్
Logo




కొత్తగూడెం గడ్డపై ఎగిరేది ఎర్ర జెండానే

News

Posted on 2026-02-06 13:12:26

Share: Share


కొత్తగూడెం గడ్డపై ఎగిరేది ఎర్ర జెండానే

కార్పొరేషన్ అభివృద్ధికి సిపిఐనే దిక్సూచి

అహంకారులకు కార్పొరేషన్ ఎన్నికలు గుణపాఠం కావాలి

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

కూనంనేని రోడ్ షోలు, ప్రచార సభలకు అపూర్వ స్పందన

డైలీ భారత్, కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం వేడెక్కింది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాలు హోరెత్తుతున్నాయి. శుక్రవారం కార్పొరేషన్ పరిధిలోని 20, 57, 49, 10, 58. 59. 60 డివిజన్లలో నిర్వహించిన భారీ రోడ్ షోలు, బహిరంగ సభల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ.. కొత్తగూడెం అభివృద్ధిలో కమ్యూనిస్టు పార్టీ పాత్రచిరస్మరణీయమని, బడుగు బలహీన వర్గాల గొంతుకగా సీపీఐ ఎల్లప్పుడూ నిలబడుతుందని స్పష్టం చేశారు. బస్తీల్లో నెలకొన్న మౌలిక వసతుల సమస్యల నుంచి సంక్షేమ ఫలాల పంపినీవరకు వరకు ప్రతి అంశంపై తాము పోరాడుతామని హామీ ఇచ్చారు. కార్పొరేషన్ పాలనలో పారదర్శకత ఉండాలంటే ఎర్రజెండా అభ్యర్థుల విజయం అనివార్యమని పేర్కొన్నారు. గడిచిన రెండేళ్లలో ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషిచేశానని, ఆదర్శవంతమైన నియోజకవర్గంగా నిలబెట్టేందుకు ప్రభుత్వంతో పోరాడి నిధులు మంజూరు చేయిస్తున్నారు.  ప్రత్యర్థి పార్టీల ప్రలోభాలకు లొంగకుండా, నిబద్ధత గల సిపిఐ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించడం ద్వారా అహంకారులకు తగినరీతిలో బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి అంటే కేవలం కాంట్రాక్టులు కాదని, సామాన్యుడి ముంగిటకు సంక్షేమ ఫలాలు చేరడం, కార్పొరేషన్ సమగ్రంగా అభివృద్ధి సాధించడమే నిజమైన విజయమని ఆయన ఉద్ఘాటించారు. కార్యక్రమాల్లో జిల్లా నాయకులు దుర్గరాసి వెంకటేశ్వర్లు, భూక్యా దస్రు, వాసిరెడ్డి మురళి,  కంచర్ల  జమలయ్య, కందుల భాస్కర్, ఎస్ కె ఫహీమ్, అభ్యర్థులు మూడ్ గణేష్, సహేరా మహమ్మద్, బోయిన విజయ్ కుమార్, మహమ్మద్ అబ్దుల్ సల్మా, కొచ్చెర్ల రాకేష్ కాంత్, ఇమ్రాన్ మహమ్మద్, బేత అనంతలక్ష్మి, నాయకులు యూసుఫ్, తుమ్మ నర్సయ్య, పల్నాటి ప్రశాంత్, అస్మత్, జడల ప్రకాష్, అజీజ్, జక్కుల రాములు, కుమారి హన్మంతరావు తదితరులు ఈ కార్యక్రమంలోపాల్గొన్నారు.

Image 1

పాక్ "హనీట్రాప్" లో చిక్కిన ఐఏఎఫ్ వింగ్ కమాండర్..

Posted On 2026-08-08 19:48:51

Readmore >
Image 1

అంతర్‌జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్‌లు స్వాధీనం

Posted On 2026-08-08 17:43:12

Readmore >
Image 1

ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!

Posted On 2026-08-08 17:41:12

Readmore >
Image 1

నూతన సొసైటీ చైర్మన్ చిందల శ్రీనివాస్ రెడ్డి కి సన్మానం

Posted On 2026-08-08 17:15:23

Readmore >
Image 1

ఒక కుటుంబం ఆకలితో... శ్రీమాత సేవా ట్రస్ట్ సాయం విజ్ఞప్తి

Posted On 2026-08-08 17:13:56

Readmore >
Image 1

విద్యావంతుడు ఎమ్మెల్యే అయినా నియోజకవర్గంలో విద్య శూన్యం..?

Posted On 2026-08-08 16:04:38

Readmore >
Image 1

రెంట్ ఎ బాయ్‌ఫ్రెండ్ "డేటింగ్ ట్రాప్".. అమ్మాయిలూ తస్మాత్ జాగ్రత్త... సీపీ సజ్జనార్

Posted On 2026-08-08 14:28:17

Readmore >
Image 1

రాజమండ్రిలో మెడికోపై తాగుబోతుల రాక్షసత్వం...

Posted On 2026-08-08 07:38:13

Readmore >
Image 1

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుండి కొత్త రేషన్ కార్డుల పంపిణీ!

Posted On 2026-08-08 04:36:39

Readmore >
Image 1

వాహనదారుల భద్రతే లక్ష్యం... సూర్యాపేట జాతీయ రహదారిపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు

Posted On 2026-08-07 16:00:29

Readmore >