| Daily భారత్
Logo




ఎమ్మార్వో నే మట్టిని తవ్విస్తున్నారా..?

News

Posted on 2026-02-01 18:09:02

Share: Share


ఎమ్మార్వో నే మట్టిని తవ్విస్తున్నారా..?

సహకరిస్తున్నది ఎవరు...! ఎందుకు...?

స్వలాభం కోసం పర్యావరణం సర్వనాశనం

గ్రావెల్ దందాపై చర్యలు ఉంటాయా...! లేవా..?

ఏజెన్సీ నియమ నిబంధనలు పెంట్లాంలో నీల్

డైలీ భారత్,కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏజెన్సీ ఏరియాలో వన్ బై సెవెన్టీ యాక్టును తుంగలో తొక్కుతున్న పరిస్థితులు ప్రత్యేకంగానే స్పష్టమవుతున్న సందర్భాలు అన్నపురెడ్డిపల్లి మండలంలో చవిచూస్తున్నాయి, కేవలం వ్యాపార లావాదేవీల కొరకు ఏజెన్సీ ప్రాంతాల్లో భారీ గుంతలు సైతం తవ్వేస్తున్న సందర్భాలు పెంట్లం గ్రామపంచాయతీలో అనేకంగానే వెలుగులోకి వస్తున్నాయి, 

కాల నిర్ణయితల సమయాలకు రెవెన్యూ అధికారులు ప్రోత్ఫలంతో రెవెన్యూ అధికారులు భూభాగ విషయాల్లో అవకతవకలను మడిచి జేబులో పెట్టిన మాదిరిగా కొందరు తెలివితేటలను ఉపయోగించి భూములను సైతం పొడిగించి, అవాంఛ ఆలోచింపత రికార్డులను నమోదు చేయించిన సంఘటనలు ఏజెన్సీ మండలమైన అనపురెడ్డిపల్లి మండలంలో అనేక రికార్డులు గాని  బ్యాంకుల నగదు రూపంలో కూడా దోచుకు తింటున్న సంఘటనలు అనేకంగానే ఉన్నాయని మండల ప్రజలు అగ్రహానికి గురవుతున్నారు, స్థానికంగా ఉన్న రెవెన్యూ శాఖ నే వారి గుంతలు సైతం తవ్విస్తుందా అంటూ మండల వాసులు ఆశ్చర్యం లో ఉండిపోయారు, 

ఎందుకు తవ్విస్తున్నారు....!

ఎవరు తవ్వుతున్నారు....!

అన్న విషయాలు మాత్రం అగాంతంలోనే ఉండిపోవటంతో మరోవైపు స్థానిక రెవిన్యూ శాఖ ఎందుకు చర్యలు తీసుకోవడంలో విఫలమవుతుంది అన్న సందేహాలు కూడా సందిగ్భంలోనే ఉండిపోయాయి, 

అధికారులు ఏళ్ల తరబడి బదిలీ కాకపోవటంతో స్థానికంగా ఉన్న అక్రమార్కులు అధికారులతోటి అధికార యంత్రాంగం తోటి పరస్పర సంబంధాలు ఏర్పాటు చేసుకొని అక్రమాలకు పాల్పడుతున్నారన్న స్థానికులు విమర్శల వర్షం కురిపిస్తున్నారు, 

నిజంగా రెవెన్యూ అధికారులే అనుమతులిచ్చి పర్యావరణాన్ని పాడు చేపిస్తున్నారా అన్న సందర్భాలు కూడా ప్రస్తుతం మండలంలో వెలుగులోకి వస్తున్నాయి, 

కన్న తండ్రె కాలయముడైతే ఎవరికి చెప్పుకోవాలో తెలియని దిన స్థితిలో ఉన్న కుటుంబ సభ్యులు వలె ప్రస్తుతం రెవిన్యూ శాఖ తీరు పెంట్లం గ్రామ పరిధిలో చర్చనీయాంశం అయింది, 

పాత రికార్డుల ప్రకారం భూమి ఎవరిది...

74 లెక్కల ప్రకారం రికార్డుల్లో లేని భూమిని ఏజెన్సీ ప్రాంతంలో కొందరు చేతివాటాలు చూపించి ఏకంగా ప్రభుత్వ భూములను తమ వంతుగా మలుచుకున్న సందర్భాలు అనేకంగా ఉన్నప్పటికీ, 

అలాంటి భూముల్లో విలువైన గ్రావెల్ మట్టిని భారీ యంత్రాలతోటి నిలువెత్తు భారీ గుంతలు పెడుతూ పర్యావరణాన్ని పాడు చేస్తా ఉంటే మండల కేంద్రానికి కూత వేటు దూరంలో ఉన్న రెవిన్యూ శాఖ మౌనం పాటిస్తా ఉండటంపై పలు అనుమానాలు మండలంలో స్పష్టమవుతున్నాయి అని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు, 

దందా ఇంతే దాదా గిరి అంతే...!!

నన్ను ఎవరు ఏమి చేయలేరు అన్న తరహాలో కొందరు అధికారులు కొమ్ము కాస్తున్నట్టు స్పష్టమవుతున్నప్పటికీ స్థానికులు ఆందోళనకి సంబంధిత శాఖలు కనీసం స్పందన లేకపోవడంపై అన్యాయాలకు నిజానికి నిలువెత్తు నిదర్శనమని స్థానిక ప్రజలు ఎత్తి పొడుస్తున్నారు, 

సమాచారం ఇచ్చినప్పటికీ చర్యలు శూన్యం

అధికార యంత్రంగాలు ఇది అక్రమం అని చూపెట్టినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై నిజంగానే కొమ్ముకాస్తున్నారు అన్న అపోహలు పెంట్లం గ్రామపంచాయతీలో ఘననీయంగానే ఉన్నాయి,

ప్రతిపక్ష పార్టీ ఆధీనంలో పోటీ చేసి అనేక హామీలుతో నూతన పాలకవర్గ సభ్యులుగా ఎన్నికైన సభ్యుడు కూడా తన సొంత గ్రామ పరిధిలో అక్రమాలు ప్రత్యక్షంగా స్పష్టమవుతుంటే ఎందుకు మౌనం పాటిస్తున్నారో  అర్థం కాని విశిష్ట గానే ఉండిపోయింది, లేక నూతన పాలకవర్గ సభ్యుడే మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నాడా అన్న ప్రశ్నలు కూడా పెంట్లం గ్రామపంచాయతీలో ప్రజలు గుసగుసలాడుతున్నారు, 

ఇది ఏమైనాప్పటికీ ఇదే తరహాలో రోజురోజుకీ పర్యావరణాన్ని పాడుచేస్తే అన్నపురెడ్డిపల్లి మండలం మరో మహానగరంగా మారుతుందని పలువురు నిపుణులు చర్చించుకుంటున్నారు, 

ఇకనైనా అధికారులు స్పందించి అక్రమార్కుల ఆగడాలకు అడ్డుకట్ట వేస్తారా లేదా వేచి చూడాలంటూ స్థానిక ప్రజానికం ఆశగా ఎదురుచూస్తుంది, 

చర్యలు గనుక తీసుకోకపోతే మరింత మంది అక్రమార్కుడు రెచ్చిపోయి పర్యావరణాన్ని పూర్తిస్థాయిలో ధ్వంసం చేస్తారని స్థానికులు చర్చించుకుంటున్నారు,

Image 1

గుప్త నిధుల పేరుతో మోసాలు... నలుగురు సభ్యుల ముఠా అరెస్ట్

Posted On 2026-08-10 18:28:25

Readmore >
Image 1

తెలంగాణకు కేంద్రం భారీ కానుక... 736 KGBV మంజూరుకు లోక్‌సభలో ఆమోదం

Posted On 2026-08-10 18:11:45

Readmore >
Image 1

సిరిసిల్లలో దారుణం : విస్కీలో నైట్రాప్ కలిపి హత్య... రాజకీయ కుట్ర కోణం

Posted On 2026-08-10 17:34:03

Readmore >
Image 1

వేములవాడలో రూ.50 వేలతో పట్టుబడ్డ బెదిరింపు దందా... వ్యాపారులను టార్గెట్ చేసిన ఇద్దరు రిమాండ్‌కు

Posted On 2026-08-10 15:38:38

Readmore >
Image 1

ఖమ్మం : ఆర్‌ఎంపీ వైద్యం వికటించి 8వ తరగతి విద్యార్థిని మృతి..

Posted On 2026-08-10 14:43:33

Readmore >
Image 1

కామారెడ్డి : తిర్మాన్‌పల్లిలో కోడిపందేలపై పోలీసుల దాడి.. 12 మంది అరెస్ట్

Posted On 2026-08-10 14:24:49

Readmore >
Image 1

పెద్ది సుదర్శన్ రెడ్డి కి నివాళులు అర్పించిన వైరా నియోజకవర్గ నాయకులు లాకవత్ గిరిబాబు

Posted On 2026-08-10 07:42:21

Readmore >
Image 1

నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ గద్దెను కూల్చివేయడం పిరికిపంద చర్య

Posted On 2026-08-10 07:40:54

Readmore >
Image 1

మిస్ యూనివర్స్ పోటీల్లో సత్తా చాటిన మాదినేని నిఖిత

Posted On 2026-08-10 07:39:20

Readmore >
Image 1

ఏపీలో జూనియర్ డాక్టర్ల నిరసనల హోరు...

Posted On 2026-08-10 07:37:01

Readmore >