Posted on 2026-08-10 14:43:33
మద్యం మత్తులో ఇంజెక్షన్ ఇచ్చినట్లు ఆరోపణ!
డైలీ భారత్, ఖమ్మం: జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ ఆర్‌ఎంపీ (RMP) వైద్యుడి నిర్లక్ష్యం, విచక్షణారహిత చికిత్స కారణంగా ఎనిమిదో తరగతి చదువుతున్న బాలిక అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోయింది. కొణిజర్ల మండలం బస్వాపురం గ్రామంలో ఈ హృదయవిదారక ఘటన వెలుగుచూసింది. చికిత్స చేసే సమయంలో సదరు వైద్యుడు మద్యం మత్తులో ఉన్నాడని, అధిక మోతాదులో మందులు, ఇంజెక్షన్ ఇవ్వడం వల్లే తమ బిడ్డ మరణించిందని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
అసలేం జరిగిందంటే..
పోలీసులు మరియు బాధిత కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. బస్వాపురం గ్రామానికి చెందిన చల్లా రమేష్ కుమార్తె చల్లా హిమశ్రీ (14). ఈమె స్థానిక కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయం (KGBV) లో 8వ తరగతి చదువుతోంది. ఆదివారం సాయంత్రం హిమశ్రీ జలుబు, దగ్గు, జ్వరంతో తీవ్ర అస్వస్థతకు గురైంది. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు ఆమెను గ్రామంలోనే క్లినిక్ నడుపుతున్న మారుతి సంపత్ అనే స్థానిక ఆర్‌ఎంపీ వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు.
ఇంజెక్షన్ ఇచ్చిన కొద్దిసేపటికే శ్వాసకోశ ఇబ్బంది:
బాధిత బాలికను పరీక్షించిన ఆర్‌ఎంపీ సంపత్.. ఆమె చేతికి కాన్యులా (Cannula) వేసి ఒక ఇంజెక్షన్ ఇచ్చాడు. అయితే, ఆ ఇంజెక్షన్ ఇచ్చిన కొన్ని నిమిషాల్లోనే హిమశ్రీ తీవ్రమైన శ్వాసకోశ ఇబ్బందికి గురైంది. గాలి పీల్చుకోలేక ఆమె తల్లడిల్లిపోవడంతో ఆర్‌ఎంపీ కంగారుపడి, వెంటనే ఖమ్మంలోని పెద్ద ఆసుపత్రికి తరలించాలని సూచించాడు.
ఆసుపత్రికి చేరేలోపే ప్రాణాలు అనంతవాయువులో..
పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు బాలికను హుటాహుటిన ఖమ్మంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ అత్యవసర విభాగంలో పరీక్షించిన వైద్యులు ఈసీజీ (ECG) నిర్వహించి, ఆమె అప్పటికే మృతి చెందినట్లు (Brought Dead) నిర్ధారించారు. దీంతో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించారు. ఈ వార్త వినగానే తల్లిదండ్రులు, బంధువులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఇంజెక్షన్ వికటించడం వల్లే తమ కుమార్తె చనిపోయిందని ఆరోపిస్తూ ప్రైవేట్ ఆసుపత్రి ఎదుట కొద్దిసేపు ఆందోళన నిర్వహించారు.
మద్యం మత్తులో వైద్యుడు?
చికిత్స అందించే సమయంలో ఆర్‌ఎంపీ మారుతి సంపత్ పూర్తి మద్యం మత్తులో ఉన్నాడని బాలిక తండ్రి చల్లా రమేష్ ఆరోపించారు. కనీస ముందస్తు జాగ్రత్తలు, అర్హత లేకుండా విచక్షణారహితంగా అధిక మోతాదులో ఇంజెక్షన్లు ఇవ్వడం వల్లే హిమశ్రీ చనిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే తరుణంలో సదరు ఆర్‌ఎంపీ ఆదివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ఖమ్మం టూ టౌన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పోలీసులకు పట్టుబడినట్లుగా కూడా సమాచారం వస్తోంది. ఈ కోణంలోనూ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.
కేసు నమోదు.. నిందితుడు పరారీ:
బాలిక తండ్రి రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొణిజర్ల సబ్ ఇన్‌స్పెక్టర్ (SI) జి. సూరజ్ కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు ప్రారంభించారు. ఘటన జరిగిన వెంటనే ఆర్‌ఎంపీ సంపత్ క్లినిక్ మూసేసి పరారయ్యాడు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకుంటుందనుకున్న కూతురు ఇలా అర్హత లేని వైద్యుడి నిర్లక్ష్యానికి బలికావడంతో బస్వాపురం గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
వేములవాడలో రూ.50 వేలతో పట్టుబడ్డ బెదిరింపు దందా... వ్యాపారులను టార్గెట్ చేసిన ఇద్దరు రిమాండ్‌కు
Posted On 2026-08-10 15:38:38
Readmore >
ఖమ్మం : ఆర్‌ఎంపీ వైద్యం వికటించి 8వ తరగతి విద్యార్థిని మృతి..
Posted On 2026-08-10 14:43:33
Readmore >
కామారెడ్డి : తిర్మాన్‌పల్లిలో కోడిపందేలపై పోలీసుల దాడి.. 12 మంది అరెస్ట్
Posted On 2026-08-10 14:24:49
Readmore >
పెద్ది సుదర్శన్ రెడ్డి కి నివాళులు అర్పించిన వైరా నియోజకవర్గ నాయకులు లాకవత్ గిరిబాబు
Posted On 2026-08-10 07:42:21
Readmore >
నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ గద్దెను కూల్చివేయడం పిరికిపంద చర్య
Posted On 2026-08-10 07:40:54
Readmore >
"నెలకొక మంచి పని... కామారెడ్డి విద్యార్థి రశ్వంత్‌కు 10వ నారాయణ సేవ"
Posted On 2026-08-10 03:31:22
Readmore >
కట్ట మైసమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్
Posted On 2026-08-09 18:12:44
Readmore >
వైరాలో ఘోరం... 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం... తెలంగాణ రక్షణ సేన నేతపై పోక్సో కేసు!
Posted On 2026-08-09 12:53:35
Readmore >