Posted on 2026-01-13 09:12:05
ప్రజావాణి కి డుమ్మా కొట్టిన అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ..
డైలీ భారత్ న్యూస్ నిజామాబాద్: సరిగ్గా జిల్లాకు వారం రోజుల ముందు బదిలీపై వచ్చిన జిల్లా కలెక్టర్ ఇల త్రిపాఠి గతంలో అనే కలెక్టర్గా పనిచేసిన జిల్లాల్లో విధుల్లో నిక్కచ్చిగా కఠినంగా ఉంటూ జిల్లా పాలన వ్యవస్థను గాడిలో పెట్టిన పేరున్న కలెక్టర్ ఆమె జిల్లాకు వచ్చి రాగానే మొదటి ప్రజావాణిలో ప్రజల సమస్యల పరిష్కార వేదిక అయిన ప్రజావాణికి అన్ని శాఖల ఉన్నత అధికారులు తప్పకుండా హాజరుకావాలని ప్రజలు సమస్యలు ఏంటో ప్రజావాణి ద్వారా వినాలని ఆమె వచ్చి రాగానే అధికారులకు ఆదేశించారు. అయినప్పటికీ ఇన్నాళ్లు ప్రజావాణి అంటే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఆయా శాఖ ఉన్నతాధికారులు ప్రజావాణికి హాజరు కాకపోగా కిందిస్థాయి సిబ్బందిని ప్రజావాణికి పంపిస్తూ నిర్లక్ష్యంగా చేతులు దులుపుకునేవారు. అయితే గత వారమే జిల్లాకు బదిలీపై వచ్చిన కలెక్టర్ ప్రజావాణిలో అన్ని శాఖల ఉన్నతాధికారులు తప్పకుండా హాజరు కావాల్సిందే అంటూ స్వయంగా కలెక్టరే చెప్పిన ఆమె ఆదేశాలను జిల్లా కు చెందిన ఆయా శాఖలో ఉన్న ఉన్నతాధికారులు బేఖాతలు చేశారు. దీంతో ప్రజావాణికి డుమ్మా కొట్టిన అధికారులపై జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తోలిసారి కొరడా ఝులిపించారు. ప్రజావాణి కార్యక్రమానికి పలు శాఖల అధికారులు గైర్హాజరు అయ్యారు. దీనిని గమనించిన కలెక్టర్ ప్రజావాణి వినతుల స్వీకరణ పూర్తయిన అనంతరం ఒక్కో శాఖ వారీగా అధికారులు హాజరు జాబితా పరిశీలించారు. సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజావాణికి గైర్హాజర్ అయిన వారికి మెమోలు జారీ చేయాలని ఆదేశించారు. ముందస్తు సమాచారం అందించకుండా పలు శాఖల అధికారులు ప్రజావాణికి గైర్హాజరు కావడం పట్ల కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. సదరు అధికారులకు షోకాజ్ మెమోలు జారీ చేయాలని ఆదేశించారు. ఇది మొదటి తప్పుగా భావించి, మెమోలతో సరిపెడుతున్నామన్నారు. ఇక నుంచి గైర్హాజర్ అయితే అధికారుల పై కఠిన చర్యలు ( వేతనాల్లో కోతలు తప్పవని) తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజావాణి కార్యక్రమానికి ఉన్న ప్రాధాన్యతను గుర్తెరిగి జిల్లా అధికారులు పాల్గొనాలని అన్నారు.
రోడ్డు ప్రమాదాల నియంత్రణపై ప్రజల్లో మరింత చైతన్యం రావాలి : ఖమ్మం త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ మోహన్ బాబు
Posted On 2026-04-13 11:03:05
Readmore >
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-04-12 18:47:01
Readmore >
కామారెడ్డి పట్టణంలోని వీఆర్కే ఇంటర్ విద్యార్థులు తమ ప్రతిభతో ఉత్తమ ఫలితాలు సాధించారు
Posted On 2026-04-12 18:45:08
Readmore >
భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు
Posted On 2026-04-12 13:50:08
Readmore >
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు
Posted On 2026-04-12 12:39:23
Readmore >
పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-12 11:41:31
Readmore >