అమర వీరుల కుటుంబాలకు ఇంటి స్థలం కోసం భూమి నీ పరిశీలించాలి
మండలనికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ కోసం స్థల పరిశీలన పూర్తి కావాలి
జిల్లా కలెక్టర్ రాజర్షి షా
డైలీ భారత్, మెదక్ ప్రతినిధి: అక్రమంగా ఇసుక తరలిస్తే కటినా చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ అన్నారు. స్థానిక కలెక్టర్ కార్యాలయం లోని సమావేశ మందిరంలో బుదవారం జిల్లా అధికారుల తో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా మాట్లాడుతు అక్రమంగా ఇసుక తరలిస్తే వాహనాలు సీజ్ చేసి, చట్టం ప్రకారం కేసులు నమోదు చేస్తామన్నారు.
ప్రజా పాలన లో నమోదు చేసుకున్న అమరవీరుల కుటుంబాలకు స్థల పరిశీలన చేయాలని,ప్రతి మండలానికి ఒక ఇంటర్ నేషనల్ స్కూల్ నిర్మాణం కోసం స్థల పరిశీలన పూర్తి చేయాలని ,ప్రభుత్వ భూమి నీ కాపాడాలని,స్పెషల్ సమ్మరీ రివిజన్ -2024 పూర్తి చేయాలన్నారు.
ధరణి లో ఉన్న పెండింగ్ ఫైల్స్ ను, ధరణి సమస్యలను పూర్తిగా పరిష్కరించాలని తెలిపారు. ఈ కార్య క్రమంలో అదనపు కలెక్టర్ వేంకటేశ్వర్లు, డిఆర్ఓ, పద్మాశ్రీ, ఆర్డీఓ లు, తహశీల్దార్ లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు