డైలీ భారత్, హుజూర్ నగర్:హుజూర్ నగర్ భవిత దివ్యాంగుల కేంద్రంలో చిన్నారులతో కూడిన క్యాలెండర్ లను ఆరోగ్యమే మహాభాగ్యం ట్రస్ట్ చైర్మన్ శీలం వెంకీ ప్రింట్ చేయించిన క్యాలెండర్లను మండల విద్యాధికారి సైదా నాయక్ చేతుల మీదుగా ఆవిష్కరించారు ఈ సందర్భంగా మండల విద్యాధికారి మాట్లాడుతూ... దివ్యాంగులకు సేవ చేయడం అదృష్టమన్నారు. భవిత కేంద్రంలో దివ్యాంగ చిన్నారులకు కావలసిన తర్ఫీదులు ఇవ్వడానికి నిష్ణానితులైన ఐఈఆర్పి మరియు శారీరక, సెరిబ్రల్ పాలసీ గల చిన్నారులకు ఫిజియోథెరపీ సేవలు అందించబడతాయని వీటిని దివ్యంగ చిన్నారులు తల్లిదండ్రులు ఉపయోగించు కోవాలని కోరారు అనంతరం ట్రస్ట్ వారు చిన్నారులతో నూతన సంవత్సర కేకు కట్ చేయించారు.
News
భవిత దివ్యాంగుల కేంద్రంలోని చిన్నారులకు నిష్ణానితులచే తర్ఫీదులు