Posted on 2026-01-08 18:35:17
డైలీ భారత్, ఖమ్మం: సోషల్ మీడియాలో చిన్న పిల్లల అశ్లీల ( చైల్డ్ పోర్నోగ్రఫీ) వీడియోలను చూసి షేర్ చేసిన కేసులో ఒక వ్యక్తిని ఖమ్మంలో అరెస్ట్ చేసినట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. ఈ కేసు వివరాలకు వెళ్తే TGCSB,NCRP మరియు NCMEC,(నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్సప్లోయిటెడ్ చిల్డ్రన్ ) ఆధ్వర్యంలో సోషల్ మీడియాలలో జరిగే మానిటరింగ్ లో భాగంగా ఫేసుబుక్ లో చైల్డ్ పోర్నోగ్రఫీ చూసి, షేర్ చేసిన కేసులో CSEAM (చైల్డ్ సెక్సువల్ ఎక్సప్లోయితతిన్ అండ్ అబ్యూస్ మెటీరియల్) కంటెంట్ ఆధారంగా నమోదు చేసిన కేసులో భాగంగా V.నిరంజన్ కుమార్, 40 సం,రాల వ్యక్తిని ఖమ్మంలో అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఆన్లైన్లో గాని, ఇంటర్నెట్లలో గాని, సోషల్ మీడియాలో గాని ఎవరైనా చైల్డ్ పోర్నోగ్రఫీ గురించి సెర్చ్ చేసిన గాని , చూసినా గాని, షేర్ చేసిన గాని, చట్ట ప్రకారం నేరస్తులు అవుతారని తెలిపారు. ఈ కేసును దర్యాప్తు చేసిన సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ డిఎస్పీ ఫణిందర్, ఇన్స్పెక్టర్ K.నరేష్, ఎస్ఐలు రంజిత్ కుమార్, విజయకుమార్, సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ సిబ్బందిని పోలీస్ కమిషనర్ అభినందించారు.
170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర
Posted On 2026-08-03 18:44:40
Readmore >
వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్
Posted On 2026-08-03 16:58:20
Readmore >
వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ
Posted On 2026-08-03 14:31:13
Readmore >
60 వేలు ఇచ్చి వివాహం చేసు కున్నాడు...తెల్లారే సరికి పెట్టె బేడా సర్దుకుని ఊడయించిన నవవధువు
Posted On 2026-08-03 05:55:39
Readmore >
ప్రతి ఇంట్లో తెలిసి ఉండాల్సిన 25 ముఖ్యమైన మందులు – ఉపయోగాలు, జాగ్రత్తలు
Posted On 2026-08-03 05:54:41
Readmore >
అంగరంగ వైభవంగా పాపకొల్లు గ్రామంలో ఆషాడ మాస బోనాల పండుగ కార్యక్రమం
Posted On 2026-08-03 05:49:18
Readmore >