| Daily భారత్
Logo




వికసిత్ భారత్–వికసిత్ గ్రామాలు లక్ష్యంగా గ్రామీణ అభివృద్ధికి విప్లవాత్మక మార్పు చట్టం అమలు

News

Posted on 2026-01-08 13:54:58

Share: Share


వికసిత్ భారత్–వికసిత్ గ్రామాలు లక్ష్యంగా గ్రామీణ అభివృద్ధికి విప్లవాత్మక మార్పు  చట్టం అమలు

బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి

డైలీ భారత్ న్యూస్ నిజామాబాద్: వికసిత్ భారత్.. వికసిత్ గ్రామాల ఏర్పాటే లక్ష్యంగా దేశంలోని గ్రామాల అభివృద్ధి కోసం ప్రధాని నరేంద్ర మోడీ గ్రామీణ అభివృద్ధి కోసం విప్లవాత్మక మార్పు చట్టం అమల్లోకి తీసుకువచ్చారని భాజపా జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి పేర్కొన్నారు. గురువారం భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో తీసుకువచ్చిన "వికసిత్ భారత్ రోజ్ గార్ ఔర్ అజీవిక మిషన్"  నూతన చట్టం గ్రామీణ అభివృద్ధిలో ఒక విప్లవాత్మకమైన ముందడుగు అని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాలలో ఈ చట్టంపై గందరగోళం సృష్టించి, సామాన్య ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు అసత్య ప్రచారాలు చేస్తున్నాయన్నారు.

ఈ చట్టం వల్ల గ్రామీణ కార్మికులు తమ ఉపాధిని కోల్పోతారని జరుగుతున్న ప్రచారం కేవలం అపోహ మాత్రమే అని ఆయన అన్నారు.

పని కోరిన 15 రోజుల్లోగా పని కల్పించకపోతే వారికి "నిరుద్యోగ భృతి" చెల్లించే నిబంధనను ఈ చట్టంలో మరింత బలోపేతం చేశారు.

గతంలో వేతనాల చెల్లింపులో జాప్యం జరిగేది, కానీ ఇప్పుడు ప్రతి వారం నేరుగా కూలీల ఖాతాల్లో వేతనాలు జమ చేయడం జరుగుతుందన్నారు.

ఒకవేళ వేతనాలు సరైన సమయానికి చెల్లించకపోతే, అదనపు పరిహారం చెల్లించే వెసులుబాటును కూడా ఈ చట్టంలో చేర్చారు.

వ్యవసాయ సీజన్లో కూలీల కొరత రాకుండా, విత్తులు, నాట్లు మరియు పంటకోత సమయాల్లో 60 రోజుల పాటు ఉపాధి పనులకు విరామం ఇచ్చే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కల్పించారు.

గ్రామ పంచాయతీ, గ్రామసభలే స్వయంగా తమ గ్రామానికి సంబంధించిన అభివృద్ధి ప్రణాళికను సిద్ధం చేసుకునే అవకాశం ఉందన్నారు.

ఈ పథకం కింద ప్రధానంగా నీటి సంరక్షణ, మౌలిక సదుపాయాల కల్పన, జీవనోపాధి ఆధారిత పనులు విపత్తు నిర్వహణ వంటి నాలుగు రకాల పనులు చేపట్టనున్నారు. ఇందులో చెరువులు, చెక్ డ్యామ్లు, పాఠశాలలు, ఆసుపత్రులు, రోడ్లు, కాలువలు వంటి నిర్మాణాలతో పాటు, మహిళా స్వయం సహాయక బృందాల ఆదాయాన్ని పెంచే పనులను కూడా చేర్చారన్నారు.

ఆధార్, బయోమెట్రిక్ అనుసంధానం ద్వారా నిధులు పక్కదారి పట్టకుండా అడ్డుకట్ట వేయడంతో పాటు, ఎప్పటికప్పుడు తనిఖీలు చేపట్టడం జరుగుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు పోతన్కార్ లక్ష్మీనారాయణ, నాయకులు ప్రమోద్, జ్యోతి, బద్దం కిసాన్, వీరేందర్, ఓం సింగ్, ఇప్పకాయల కిషోర్, తారక్ వేణు, మాస్టర్ శంకర్, బుర్గుల వినోద్, ఆమందు విజయ్ కృష్ణ, సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

Image 1

దుబాయ్‌లో హై అలర్ట్... 20 నిమిషాల వ్యవధిలో 7 భారీ పేలుళ్లు... క్షిపణి దాడులా? ప్రమాదమా?

Posted On 2026-08-05 13:28:01

Readmore >
Image 1

కామారెడ్డి : ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠా కీలక నిందితుడు అరెస్ట్ - iPhone స్వాధీనం

Posted On 2026-08-05 13:09:21

Readmore >
Image 1

ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-08-04 14:15:02

Readmore >
Image 1

వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు

Posted On 2026-08-04 14:13:47

Readmore >
Image 1

"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-08-04 13:06:14

Readmore >
Image 1

సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!

Posted On 2026-08-04 09:03:06

Readmore >
Image 1

యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్

Posted On 2026-08-04 08:26:26

Readmore >
Image 1

విధులను బహిష్కరించిన న్యాయవాదులు

Posted On 2026-08-04 08:12:56

Readmore >
Image 1

170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర

Posted On 2026-08-03 18:44:40

Readmore >
Image 1

వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్

Posted On 2026-08-03 16:58:20

Readmore >