| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని.. కత్తితో వివాహిత హల్చల్

భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని.. కత్తితో వివాహిత హల్చల్

వరంగల్ చౌరస్తాలో కత్తితో వివాహిత హల్చల్..

డైలీ భారత్, వరంగల్: వరంగల్ చౌరస్తాలో వివాహిత కత్తి పట్టుకుని హల్చల్ చేసింది. భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని కత్తితో దాడికి యత్నించింది. భార్య నుండి తప్పించుకునేందుకు జ్యువలరీ షాపులోభర్త దాక్కున్నాడు.వెంటనే డయల్100 కి ఫోన్ చేశాడు భర్త. అక్కడికి చేరుకున్న పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి మహిళ చేతిలోని కత్తిని పోలీసులు లాక్కున్నారు. తనకు న్యాయం చేయాలంటూ రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగింది వివాహిత జ్యోత్స్న.తన భర్త శ్రీకాంత్ అక్రమ సంబంధం పెట్టుకొని తనకు విడాకులు ఇస్తున్నాడని ఆరోపించింది. తనకు ఉండడానికి చోటు లేకుండా వేధింపులకు గురిచేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఆస్తిని, పిల్లలను తనకు కాకుండా చేస్తున్నాడని మండిపడింది. కాగా విడాకుల కోసం భర్త శ్రీకాంత్ కోర్టు మెట్లు ఎక్కినట్లు తెలిపింది. పోలీసులు వివాహితకు నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు

Previous సిరిసిల్ల పట్టణ పరిధిలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నివారణపై అవగాహన కార్యక్రమం – ఉల్లంఘించిన వారికి జరిమానాలు
Next సంకల్ప ఫౌండేషన్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి శ్రీధర్ బాబు
ADVERTISEMENT