Posted on 2026-01-06 22:07:18
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: ముఖ్యమంత్రి ఎవరు వచ్చినా రంగారెడ్డి జిల్లాలోని భూములను అమ్ముతున్నారు తప్పా జిల్లా అభివృద్ధికి నిధులు అందించడం లేదని శాసన మండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు.
రాష్ట్ర శాసనసభల 25వ సమావేశం లో భాగంగా శాసన మండలి లో డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ అధ్యక్షతన సాగిన ప్రత్యేక ప్రస్తావన లలో ఆయన ఈ విషయం ప్రస్తావించారు. నాడు ఎన్టీ రామారావు మొదలు చంద్రబాబు నాయుడు, వైయస్ రాజశేఖర్ రెడ్డి, కెసిఆర్, ఇలా ముఖ్యమంత్రి ఎవరైనా రంగారెడ్డి జిల్లాలోని చాలా భూములను వేలాది కోట్లకు అమ్మి సంక్షేమ కార్యక్రమాలను అమలు పరిచేందుకు సదరు నిధులను వినియోగించారని చెప్పారు. ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాల కోసం, ప్రభుత్వాన్ని నిర్వహించడం కోసం రంగారెడ్డి జిల్లా భూములను అమ్మిన జిల్లాకు మాత్రం అందవలసిన స్థాయిలో నిధులు అంద లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు ఎమ్మెల్సీగా, రెండుసార్లు మంత్రిగా పనిచేసిన తనను, తమలాంటి నాయకులను ప్రజలు ప్రశ్నిస్తున్నారని ఆయన వివరించారు. ప్రభుత్వం ప్రభుత్వం విలువైన రంగారెడ్డి జిల్లా అమ్ముకుంటున్న సందర్భంలో జిల్లా అభివృద్ధికి 20% లేదా 30% ఎంత ఇస్తారో పేర్కొని ఆ నిధులను జిల్లా అభివృద్ధికి వినియోగించేలా చూడాలని ఆయన స్పష్టం చేశారు. జిల్లాకు చెందిన భూములను కూడా అమ్మారని ఎకరాకు 150 కోట్ల పై మాటే పలికాయని ఇలా అమ్ముతున్న నిధులలో జిల్లాకు వాటా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజలు ఈ విషయాన్ని గమనిస్తున్నారని, నాయకులను ప్రశ్నిస్తున్నారని, తాము సమాధానం చెప్పలేక పోతున్నామని ఆయన పేర్కొన్నారు. ఇలాగైతే భవిష్యత్తులో జిల్లాలో ప్రజలు తిరగబడి పెద్ద ఎత్తున ఉద్యమాన్ని తీసుకొచ్చే పరిస్థితులు ఉన్నాయని మహేందర్ రెడ్డి వెల్లడించారు. కనీసం ఈ ప్రభుత్వమైనా రంగారెడ్డి జిల్లాలో అమ్ముతున్న భూముల ద్వారా వచ్చిన డబ్బులలో జిల్లా అభివృద్ధి కోసం కనీసం 40% కేటాయించాలని శాసన మండలి ద్వారా ప్రభుత్వాన్ని కోరుకున్నట్లు మహేందర్ రెడ్డి చెప్పారు.
తాడ్వాయి మండలంలోని కరడ్‌పల్లిలో కల్తీ కల్లు విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్
Posted On 2026-08-06 18:26:12
Readmore >
పండరి – స్వరూప కుటుంబానికి శ్రీ మాత సేవ చారిటబుల్ ట్రస్ట్ అండ
Posted On 2026-08-05 17:07:25
Readmore >
ఒక్క నంబర్‌తో 18 సేవలు... తెలంగాణలో డయల్ 112 లాంఛ్ చేసిన DGP సి.వి. ఆనంద్
Posted On 2026-08-05 14:58:50
Readmore >
దుబాయ్‌లో హై అలర్ట్... 20 నిమిషాల వ్యవధిలో 7 భారీ పేలుళ్లు... క్షిపణి దాడులా? ప్రమాదమా?
Posted On 2026-08-05 13:28:01
Readmore >
కామారెడ్డి : ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠా కీలక నిందితుడు అరెస్ట్ - iPhone స్వాధీనం
Posted On 2026-08-05 13:09:21
Readmore >
ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-08-04 14:15:02
Readmore >
వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు
Posted On 2026-08-04 14:13:47
Readmore >
"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-08-04 13:06:14
Readmore >