| Daily భారత్
Logo




తనిఖీల్లో గంజాయి పట్టివేత.... ప్రజారక్షణే కామారెడ్డి పోలీసుల లక్ష్యం

News

Posted on 2026-01-04 15:59:09

Share: Share


తనిఖీల్లో గంజాయి పట్టివేత....  ప్రజారక్షణే కామారెడ్డి పోలీసుల లక్ష్యం

నేరస్థులకు భయం – ప్రజలకు భరోసా

గంజాయి రవాణాను భగ్నం చేసిన పోలీసు  సిబ్బందిని అభినందించి క్యాష్ రివార్డు అందజేసిన జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర

 డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా నేర నియంత్రణ, ప్రజల భద్రత లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ చేపట్టిన ఆపరేషన్ కవచ్ కార్యక్రమం గణనీయమైన ఫలితాలను ఇస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా అంతరాష్ట్ర దొంగతనాలు, రోడ్డు ప్రమాదాలు  తగదల,  గంజాయి రవాణా వంటి అక్రమ కార్యకలాపాలను అరికట్టడంతో పాటు జిల్లాలో నేరలను అదుపులోకి తీసుకువస్తున్నారు. ఈ క్రమంలో రాత్రి వేళల్లో జిల్లా వ్యాప్తంగా ప్రతీ వాహనం కూడా తనిఖీ చేయబడుతున్నాయి.

ఆపరేషన్ కవచ్ లో భాగంగా దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని నర్సన్నపల్లి చౌరస్తా వద్ద రాత్రి సమయంలో వాహన తనిఖీలు నిర్వహిస్తున్న పోలీస్ బృందం అప్రమత్తంగా ఉంటూ ప్రతీ వాహనాన్ని తనిఖీ చేయడం జరిగింది.  ఈ క్రమములో  హైదరాబాద్ వైపు వెళ్తున్న ఆటోను కూడా ఆపి అనుమానంతో పూర్తిగా తనిఖీ చేయగా అందులో ఏర్పడకుండా దాచిన గంజాయిని గుర్తించారు. వెంటనే ఆటోలో గంజాయిని తరలిసుతున్న ముగ్గురు నిందితులను పట్టుకొని దేవునిపల్లి పోలీస్ స్టేషన్‌ నందు అప్పగించగా, దేవునిపల్లి పియస్  అధికారులు వారిపై కేసు నమోదు చేసి ముగ్గురు నేరస్తులను అరెస్టు చేయడం జరిగింది. 

రాత్రి తీవ్ర చలిలోనూ విధులు నిర్వహిస్తూ అప్రమత్తతతో వ్యవహరించి గంజాయి రవాణా చేస్తున్న నేరస్తుల పట్టివేతలో కీలక పాత్ర పోషించిన 6 గురు పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అభినందించి  క్యాష్ రివార్డుతో సత్కరించడం జరిగింది. 

వారి వివరాలు: 

ఎల్. నరసయ్యఏఎస్ఐ, దేవునిపల్లి, సుబ్బారెడ్డి ఏఆర్ హెడ్ కానిస్టేబుల్, రెడ్డి నాయక్ ఏఆర్ హెడ్ కానిస్టేబుల్, సంతోష్ ఏఆర్ కానిస్టేబుల్, బలరాం ఏఆర్ కానిస్టేబుల్,  భూపతి (హోమ్ గార్డ్ – దేవునిపల్లి పీఎస్)

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ,

ప్రజల భద్రతే పోలీస్ శాఖ యొక్క ప్రధాన బాధ్యత అని తెలిపారు. రాత్రి సమయంలో చలిని కూడా లెక్కచేయకుండా ప్రజల రక్షణ కోసం ప్రతిరోజూ జిల్లా వ్యాప్తంగా రాత్రి సమయములో కూడా ముఖ్యమైన ప్రాంతాలను గుర్తించి ఆపరేషన్ కవచ్ ద్వారా వాహన తనిఖీలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ తనిఖీల్లో భాగంగానే నర్సన్నపల్లి వద్ద తనిఖీ  చేయగా గంజాయి పట్టివేత జరిగిందని పేర్కొన్నారు.

జిల్లాలోని పోలీస్ సిబ్బంది పూర్తిస్థాయిలో విధులు నిర్వహిస్తూ నిబద్ధతతో పనిచేయడం ఎంతో సంతోషకరమని, విధి నిర్వహణలో చాకచక్యంగా వ్యవహరిస్తూ నేరస్తుల ప్రతీకదలికపై కఠినంగా వ్యవహరిస్తున్నారని ప్రశంసించారు. నిబద్ధతతో విధులు నిర్వర్తిస్తే గౌరవం, గుర్తింపు, రివార్డులు వాటంతట  అవే వస్తాయని జిల్లా ఎస్పీ గారు స్పష్టం చేశారు. జిల్లాలో విధి నిర్వహణలో ఉత్తమంగా పని చేసే పోలీస్ సిబ్బందికి తగిన అవార్డులు, రివార్డులు ఇకపై కూడా  తప్పకుండా అందజేయబడతాయని జిల్లా ఎస్పీతెలిపారు.

జిల్లాలో గంజాయి, దొంగతనాలు మరియు ఇతర అక్రమ కార్యకలాపాలను అణచివేయడానికి జిల్లా పోలీస్ శాఖ నిరంతరం చర్యలు కొనసాగిస్తుంది. ప్రజలు కూడా పోలీస్ శాఖకు సహకరించాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు.

Image 1

ఘోర ప్రమాదం.. ఢీకొట్టుకుని బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ లగ్జరీ బస్సు, ఐషర్ వాహనం.. 20 మందికి తీవ్ర గాయాలు!

Posted On 2026-08-09 08:27:49

Readmore >
Image 1

ఏడాదిగా మూసి ఉన్న ఇంటి తలుపులు.. అనుమానంతో తెరిచి చూస్తే బయటపడ్డ అస్థిపంజరం!

Posted On 2026-08-09 08:09:49

Readmore >
Image 1

కామారెడ్డి : విద్యుత్ నగర్ లో భారీ చోరీ

Posted On 2026-08-09 06:28:48

Readmore >
Image 1

పాక్ "హనీట్రాప్" లో చిక్కిన ఐఏఎఫ్ వింగ్ కమాండర్..

Posted On 2026-08-08 19:48:51

Readmore >
Image 1

అంతర్‌జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్‌లు స్వాధీనం

Posted On 2026-08-08 17:43:12

Readmore >
Image 1

ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!

Posted On 2026-08-08 17:41:12

Readmore >
Image 1

నూతన సొసైటీ చైర్మన్ చిందల శ్రీనివాస్ రెడ్డి కి సన్మానం

Posted On 2026-08-08 17:15:23

Readmore >
Image 1

ఒక కుటుంబం ఆకలితో... శ్రీమాత సేవా ట్రస్ట్ సాయం విజ్ఞప్తి

Posted On 2026-08-08 17:13:56

Readmore >
Image 1

విద్యావంతుడు ఎమ్మెల్యే అయినా నియోజకవర్గంలో విద్య శూన్యం..?

Posted On 2026-08-08 16:04:38

Readmore >
Image 1

రెంట్ ఎ బాయ్‌ఫ్రెండ్ "డేటింగ్ ట్రాప్".. అమ్మాయిలూ తస్మాత్ జాగ్రత్త... సీపీ సజ్జనార్

Posted On 2026-08-08 14:28:17

Readmore >