| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

వెంకటేశ్వర దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తేదాపా శ్రేణులు

వెంకటేశ్వర దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తేదాపా శ్రేణులు

డైలీ భారత్, సిరిసిల్ల: నూతన సంవత్సర పర్వదినాన్ని పురస్కరించుకొని సిరిసిల్ల పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో టిడిపి నాయకులు తీగల శేఖర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా తీగల శేఖర్ గౌడ్ మాట్లాడుతూ నూతన సంవత్సరంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో గడపాలని,అలాగే వారు చేపట్టే పనులలో విజయం సాధించి మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.ఇట్టి కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు మిద్దె ప్రకాష్, టి,ఎన్,ఎస్,ఎఫ్ నాయకులు మోతె రాజిరెడ్డి,టిడిపి నాయకులు గుజ్జే శివరాం, టీ,ఎన్,ఎస్,ఎఫ్ నాయకులు శ్యాగ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

Previous జిల్లాలో ఆగని కిడ్నాప్ ల పరంపర
Next రాజేష్‌ మృతిపై హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలి
ADVERTISEMENT