నగర శివారులోని ముబారక్ నగర్ లో బాలుడిని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించిన దుండగులు
ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన... వైరల్ గా మారిన సిసి కెమెరా వీడియో
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: జిల్లాలో కొద్ది రోజులుగా కొనసాగుతున్న చిన్నారుల కిడ్నాప్ ముఠా ఆగడాలు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో జిల్లా వాసులు చిన్నారుల తల్లిదండ్రులు తమ పిల్లలు ఎప్పుడూ ఎవరి చేతిలో కిడ్నాప్ అవుతారని భయాందోళనలకు గురవుతున్నారు. తాజాగా నిజామాబాద్ శివారులోని ముబారక్ నగర్లో ఓ బాలుడు కిడ్నాప్ ఘటన కలకలం రేపింది.ఈ ఘటన ఈనెల 24వ తేదీన చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ముబారక్ నగర్లో నడుచుకుంటూ వెళుతున్న బాలుడిని బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశారు. అయితే స్థానికులు ఇది గమనించడంతో వారు పారిపోయారు. ఇందుకు సంబంధించిన సీసీ ఫుటేజ్ వీడియో వైరల్ గా మారింది. అయితే ఈ కిడ్నాప్ గుట్టు రట్టు చేసేందుకు పోలీసులు ఛాలెంజ్ గా తీసుకొని ఆ ముఠాను వీలైనంత త్వరగా పట్టుకోవాలని ప్రజలు పోలీసులను కోరుతున్నారు.