| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మచిలీపట్నంలోని ఉషా క్లినిక్ ఆసుపత్రికి విచ్చేసిన మద్దిశెట్టి సామెలు కు ఘన స్వాగతం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మచిలీపట్నంలోని ఉషా క్లినిక్ ఆసుపత్రికి విచ్చేసిన మద్దిశెట్టి సామెలు కు ఘన స్వాగతం

డైలీ భారత్, మచిలీపట్నం:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మచిలీపట్నం పట్టణంలో ఉన్న ఉషా క్లినిక్ ఆసుపత్రికి మద్దిశెట్టి సామెలు విచ్చేయనున్నారని తెలుసుకున్న గుడివాడ  మచిలీపట్నం నియోజకవర్గాల ఎన్‌సీపీ పార్టీ కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు పుష్పగుచ్ఛాలు అందజేసి, హర్షాతిరేకాలతో మద్దిశెట్టి సామెలును ఆహ్వానించారు. పార్టీ అభివృద్ధి, ప్రజాసేవ పట్ల ఆయన చూపుతున్న నిబద్ధతను కొనియాడుతూ కార్యకర్తలు తమ అభిమానాన్ని వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా మద్దిశెట్టి సామెలు మాట్లాడుతూ, తనకు ఘన స్వాగతం పలికిన గుడివాడ – మచిలీపట్నం ప్రాంత ఎన్‌సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ సమిష్టిగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.

Previous జక్కుల మల్లయ్యను పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
Next మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం
ADVERTISEMENT