Posted on 2025-12-28 12:41:44
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: భారత దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో ప్రముఖ పాత్రను కాంగ్రెస్ పార్టీయే పోషించిందని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు.ఆదివారం 140వ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బాలాపూర్ చౌరస్తా, ఆర్కేపురం, సరూర్ నగర్ ప్రాంతాల్లో మూడు రంగుల జెండాను పార్టీ శ్రేణులతో కలిసి ఆయన ఎగరేశారు.ఈ సందర్భంగా కేఎల్ఆర్ మాట్లాడుతూ విద్య, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ కార్యకలాపాల్లో భారతీయుల పాత్ర లేకుండా బ్రిటీష్, రాజులు, నిజాం నవాబుల పాలన కొనసాగిందని గుర్తు చేశారు.తుపాకులతో కాకుండా అహింస సిద్ధాంతంతో స్వాతంత్య్ర సాధించాలని నాటి కాంగ్రెస్ పెద్దలు భావించి ఉద్యమించారని అన్నారు.ప్రజాస్వామ్యాన్ని తెచ్చిందే కాంగ్రెస్ రాష్ట్రం, దేశంలోనే సాగునీటి ప్రాజెక్టులను కట్టిందే కాంగ్రెస్ ప్రభుత్వాలు అని ఆయన తెలిపారు.మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చేందుకు బీజేపీ కేంద్ర నాయకత్వం కుట్రలు చేస్తుందని మండిపడ్డారు.బీదలు, బడుగు బలహీన వర్గాలకు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాపాలనలో సంక్షేమ పథకాలు అందిస్తున్నామని ఆయన చెప్పారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విభాగాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి జిల్లాలో సిసిఎస్ పోలీసుల మెరుపు దాడి : అక్రమ జూదం ఆడుతున్న నలుగురి అరెస్ట్
Posted On 2026-04-09 15:19:40
Readmore >
చిన్నారుల అసాధారణ ప్రతిభ : భగవద్గీత పఠనంలో "ఎలైట్ వరల్డ్ రికార్డ్" సాధించిన అన్నదమ్ములు
Posted On 2026-04-09 14:11:13
Readmore >
యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు... డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-09 06:18:50
Readmore >
తమిళనాడు ప్రధాన కార్యదర్శి గా తెలుగు వ్యక్తి ఎం.సాయికుమార్ బాధ్యతలు స్వీకారం
Posted On 2026-04-09 06:00:41
Readmore >