Posted on 2025-12-27 03:37:58
బీసీ రిజర్వేషన్ల అమలుపై ఈ అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి భవిష్యత్ కార్యాచరణ పై నిర్ణయం తీసుకోవాలి
బీసీ రిజర్వేషన్లపై రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం
ఈనెల 31న అఖిలపక్ష సమావేశం, ఫిబ్రవరిలో బీసీల బస్సు యాత్ర, ఏప్రిల్ లో హైదరాబాదులో బహిరంగ సభ నిర్వహిస్తాం
బీసీ జేఏసీ సమావేశంలో జాజుల శ్రీనివాస్ గౌడ్ వెల్లడి
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: కేంద్ర నిధులు హైకోర్టు తీర్పులతోనే గ్రామపంచాయతీ ఎన్నికలు మాత్రమే నిర్వహిస్తామని ఎంపీటీసీ, జెడ్పిటిసి ఎన్నికలు మాత్రం 42 శాతం బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతనే నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి సర్పంచ్ ఎన్నికల సందర్భంగా చెప్పాడని, ఇప్పుడు మాట మార్చి అసెంబ్లీ సమావేశాల్లో ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటామని సీఎం పేర్కొనడాన్ని బీసీ జేఏసీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. శుక్రవారం హైదరాబాదు లోని సైబరాబాద్ లో ఉన్న బీసీ జేఏసీ రాష్ట్ర కార్యాలయంలో బీసీ రిజర్వేషన్ల పెంపు భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ పై బీసీ జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశం జరిగింది సమావేశం అనంతరం మీడియాతో జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ సర్పంచ్ ఎన్నికలు ఏ పార్టీకి అనుకూలంగా రాలేదని బీసీల రాజకీయ చైతన్యంతో ప్రభంజనంలా జనరల్ స్థానాల్లో కూడా బీసీ సర్పంచులు గెలిచి తెలంగాణ రాష్ట్రంలో బీసీల రాజకీయ శకాన్ని ప్రారంభించారని ఆయన తెలిపారు.ఈనెల 29వ తేదీ నుండి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో బీసీ రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచడానికి అఖిలపక్షంతో ఢిల్లీకి వెళ్లేలా అసెంబ్లీ వేదికగా ఒక రాజకీయ కార్యాచరణ ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు బీసీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉంటామని అసెంబ్లీలో ప్రకటించిన రాజకీయ పార్టీలు ఇప్పుడు మాట మార్చి వ్యహరిస్తున్నాయని, ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకవైపు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ఇంకొక వైపు టిఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు డిమాండ్ చేయడం చాలా సిగ్గుచేటు అన్నారు.బీసీ జేఏసీ అష్టంగా ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా రాష్ట్ర బంద్ నిర్వహించడమే కాకుండా, గల్లి నుండి ఢిల్లీ వరకు పోరాటాలు చేశామని ఇకనుండి బీసీ జేఏసీ ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి ఈనెల 31వ తేదీన హైదరాబాదులో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని అలాగే బీసీల రాజకీయ చైతన్యం తో రాష్ట్రవ్యాప్తంగా గెలిచిన 5380 మంది బీసీ సర్పంచులతో సంక్రాంతి తర్వాత బీసీ సర్పంచుల రాష్ట్ర ఆత్మీయ అభినందన సభను నిర్వహిస్తామని అలాగే ఫిబ్రవరి రెండో వారం నుండి రాష్ట్రవ్యాప్తంగా బీసీల రథయాత్ర చేపడుతామని అనంతరం ఏప్రిల్ మొదటి వారంలో లక్షలాది మందితో హైదరాబాదులో వేలవృత్తులు కోట్ల గొంతులు అనే నినాదంతో భారీ బహిరంగ సభను నిర్వహించి బీసీల సత్తాను చాటి చెప్తామని ఆయన తెలిపారు.ఈ సమావేశంలో జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ, ప్రొఫెసర్ ఎం బాగయ్య ప్రొఫెసర్ సంఘవి మల్లేశ్వర్, బీసీ జేఏసీ కో చైర్మన్ కాటేపల్లి వీరస్వామి, బీసీ జేఏసీ వైస్ చైర్మన్ పిట్ల శ్రీధర్, బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్ గౌడ్, బీసీ మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు బి మని మంజరి, దీటి మల్లయ్య, జాజుల లింగం, మాధవ్ మేరు, నరాల సుధాకర్, గజ్జల సత్యం, తారకేశ్వరి, ఉదయ్ నేత, శివమ్మ, వెంకటేష్ గౌడ్, గూడూరు భాస్కర్, తదితరులు పాల్గొన్నారు .
కామారెడ్డి జిల్లాలో సిసిఎస్ పోలీసుల మెరుపు దాడి : అక్రమ జూదం ఆడుతున్న నలుగురి అరెస్ట్
Posted On 2026-04-09 15:19:40
Readmore >
చిన్నారుల అసాధారణ ప్రతిభ : భగవద్గీత పఠనంలో "ఎలైట్ వరల్డ్ రికార్డ్" సాధించిన అన్నదమ్ములు
Posted On 2026-04-09 14:11:13
Readmore >
యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు... డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-09 06:18:50
Readmore >
తమిళనాడు ప్రధాన కార్యదర్శి గా తెలుగు వ్యక్తి ఎం.సాయికుమార్ బాధ్యతలు స్వీకారం
Posted On 2026-04-09 06:00:41
Readmore >