| Daily భారత్
Logo




ప్రోటోకాల్ పాటించని అధికారులపై చర్యలు తీసుకోండి

News

Posted on 2025-12-24 19:41:12

Share: Share


ప్రోటోకాల్ పాటించని అధికారులపై చర్యలు తీసుకోండి

జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నాయకులు

డైలీ భారత్ న్యూస్,కరీంనగర్:ప్రభుత్వ కార్యక్రమాలలో ప్రోటోకాల్ పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలని జిల్లా గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేష్ , జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు కొరివి అరుణ్ కుమార్ బుధవారం  జిల్లా కలెక్టర్ పమేలా కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరీంనగర్ సి.ఎస్.ఐ ప్రాంగణంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహించబడ్డాయని, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, నగర ప్రతినిధులను కలుపుకొని సంబంధిత అధికారులు కార్యక్రమాన్ని సమన్వయం చేసే  ప్రయత్నం చేసారనీ చెప్పారు. మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఫోటోను పూర్తిగా విస్మరించారనీ అన్నారు.  మొదటిసారి కాదని ఇటీవల సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో (7వ వార్డు) నియోజకవర్గం అయినప్పటికీ అధికారిక ఫోటోలు, సమాచారంలో పొందుపరచలేదనీ గుర్తు చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలచే ఎన్నుకోబడిన ప్రతినిధులకు తగిన గౌరవం, గుర్తింపు ఇవ్వడం అత్యంత అవసరం అని, భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా జిల్లా కలెక్టర్ తగు చర్యలు తీసుకోవాలని కోరారు. దీనికి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మామిడి అనిల్, జీడి రమేష్, సముద్రాల లక్ష్మణ్, జుంజుపల్లి వివేక్, గొట్టే బాబు, కనకం విద్యాసాగర్,  యూత్ కాంగ్రెస్ నాయకులు మణికంఠ, తదితరులు పాల్గొన్నారు.

Image 1

మేము కొన్ని తప్పులు చేశాము

Posted On 2026-04-12 22:37:33

Readmore >
Image 1

జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-04-12 18:47:01

Readmore >
Image 1

కామారెడ్డి పట్టణంలోని వీఆర్కే ఇంటర్ విద్యార్థులు తమ ప్రతిభతో ఉత్తమ ఫలితాలు సాధించారు

Posted On 2026-04-12 18:45:08

Readmore >
Image 1

సింగర్ ఆశా భోంస్లే కన్నుమూత

Posted On 2026-04-12 16:53:08

Readmore >
Image 1

భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు

Posted On 2026-04-12 13:50:08

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు

Posted On 2026-04-12 12:39:23

Readmore >
Image 1

భారీ అగ్నిప్రమాదం

Posted On 2026-04-12 12:10:38

Readmore >
Image 1

పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

Posted On 2026-04-12 11:41:31

Readmore >
Image 1

శీర్షిక : ఆడది ఆటబొమ్మ కాదు-- మంజుల పత్తిపాటి

Posted On 2026-04-12 08:16:03

Readmore >
Image 1

డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే

Posted On 2026-04-11 22:48:59

Readmore >