డైలీ భారత్ న్యూస్, మేడ్చల్:అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం (ABABS) బాచుపల్లి మండల శాఖ అధ్యక్షుడిగా కందిమళ్ళ రంజిత్ కుమార్ ను నియమించినట్లు, అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం జాతీయ అధ్యక్షుడు అడ్వకేట్ వాండ్రాసి పెంచలయ్య పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మండల శాఖ అధ్యక్షుడిగా ఎన్నికైన రంజిత్ కుమార్ మాట్లాడుతూ ప్రతి నిత్యం అయ్యప్ప భక్తుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం బలోపేతానికి కృషి చేస్తానని తనను మండల శాఖ అధ్యక్షుడుగా నియమించిన జాతీయ అధ్యక్షుడు అడ్వకేట్ వాండ్రాసి పెంచలయ్యకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.