| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి : కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి

ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి  : కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి

డైలీ భారత్ న్యూస్, రంగారెడ్డి జిల్లా :  ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి అని మాజీ ఎమ్మెల్యే, మహేశ్వరం నియోజకవర్గం  కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు.బుధవారం తుక్కుగూడ మున్సిపాలిటీ జెన్నాయిగూడ శ్రీ లక్ష్మీనరసింహా స్వామి ఆలయాన్ని యాదగరిగుట్ట మాదిరిగా తీర్చిదిద్దాలని నూతన ధర్మకర్తల మండలికి కేఎల్ఆర్ సూచించారు.దేవాలయ నూతన ఛైర్మన్ కోటగళ్ల రంజిత్ కుమార్ సహా కమిటీ సభ్యులతో దేవాదాయ, ధర్మాదాయ అధికారులు ప్రమాణస్వీకారం చేయించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి నూతన కమిటీ ఛైర్మన్ సహా సభ్యులు జమ్మల నారాయణరెడ్డి, సౌకుంట్ల సుప్రజా, పాశం రవీందర్, సొప్పారి దర్శన్, వేదపండితులు, ఆలయ ఈవోను ఘనంగా సన్మానించారు.ఆలయ ప్రతిష్ట పెంచి  భక్తులకు ఇబ్బందులు లేకుండా, అభివృద్ధి జరిగేలా చూడాలని ధర్మకర్తలకు కిచ్చెన్న సూచించారు.సీఎం రేవంత్ రెడ్డి  నాయకత్వంలో తెలంగాణ నెంబర్ వన్ రాష్ట్రంగా ఎదగాలని,మహేశ్వరం మహానగరంగా అభివృద్ధి చెందాలని లక్ష్మారెడ్డి ఆకాంక్షించారు.ఆలయంలో ప్రత్యేకపూజలు చేసి... ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని స్వామివారిని ఆయన వేడుకున్నారు.ఈ కార్యక్రమంలో గుడి నూతన కమిటీ సభ్యులు సహా కాంగ్రెస్ నాయకులు, ఇందిరమ్మ కమిటీలు, మార్కెట్, ఆలయ కమిటీలు, స్థానిక నాయకులు, వేదపండితులు, అధికారులు భక్తులు పాల్గొన్నారు.

Previous పంచాయతీ ఎన్నికలలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేసి, శాంతియుత వాతావరణంలో నిర్వహణకు చర్యలు తీసుకోవాలి
Next దివ్యాంగులకు 4వేల పింఛను పెంచిన ఘనత సీఎం కేసీఆర్ దే : ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి
ADVERTISEMENT