Posted on 2025-11-24 14:04:14
తెలంగాణ రాష్ట్ర రాష్ట్రీయ లోక దళ్ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ విమర్శ
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: కాంగ్రెస్ బి ఆర్ ఎస్ రెండు పార్టీలు తెలంగాణకు, రాష్ట్ర ప్రజలకు తీవ్ర ద్రోహం చేశాయని తెలంగాణ రాష్ట్ర రాష్ట్రీయ లోక్ దళ్ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ విమర్శించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ముందుగా ఆయన మాట్లాడుతూ విద్య వైద్యం ఉపాధి వంటి కీలక వ్యవస్థలు రెండు పార్టీల వల్ల పూర్తిగా దెబ్బతిన్నాయని, ఇప్పటికీ కనీసం రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి, 28 లక్షల వృత్తి నైపుణ్య శిక్షణలు పూర్తి చేయాలి, ఇందుకు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల ఐక్యతతోనే బహుజనులకు రాజకీయ అధికారం వస్తుందని, రాష్ట్రీయ లోక్ దళ్ యువతను రాజకీయాల్లోకి రాబోయేలా ప్రోత్సహిస్తుందని తెలిపారు. రాబోయే రోజుల్లో ఈ వర్గాలకు అధిక శాతం సీట్లు కేటాయించి అవినీతి రహిత సమాజ నిర్మాణానికి తమ పార్టీ కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు చెందవలసిన లాభాలను ప్రభుత్వం దారి మళ్ళించడాన్ని తీవ్రమైన అన్యాయంగా అభివర్ణిస్తూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అప్పు కూడా పొందలేని దశకు చేరడం రేవంత్ రెడ్డి అసమర్థ పరిపాలన కారణమే అని విమర్శించారు. బీసీలకు 42 శాతం చట్టబద్ధ రిజర్వేషన్ అమలు చేసిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలన్నది ఆర్ ఎల్ డి డిమాండ్ అని తెలిపారు. ఎన్నికల సమయంలో రైతులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ విస్మరించిందని ప్రస్తుతం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బుస్సాపూర్ శంకర్ బిజెపి నాయకులు గౌరప్ప యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి మడకం ప్రసాద్ దొర రిషబ్ నరసింహారావు బుల్లెట్ వెంకన్న కళాబృందం రాష్ట్ర టీఆర్ఎల్ డి నాయకులు జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.
తాడ్వాయి మండలంలోని కరడ్‌పల్లిలో కల్తీ కల్లు విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్
Posted On 2026-08-06 18:26:12
Readmore >
పండరి – స్వరూప కుటుంబానికి శ్రీ మాత సేవ చారిటబుల్ ట్రస్ట్ అండ
Posted On 2026-08-05 17:07:25
Readmore >
ఒక్క నంబర్‌తో 18 సేవలు... తెలంగాణలో డయల్ 112 లాంఛ్ చేసిన DGP సి.వి. ఆనంద్
Posted On 2026-08-05 14:58:50
Readmore >
దుబాయ్‌లో హై అలర్ట్... 20 నిమిషాల వ్యవధిలో 7 భారీ పేలుళ్లు... క్షిపణి దాడులా? ప్రమాదమా?
Posted On 2026-08-05 13:28:01
Readmore >
కామారెడ్డి : ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠా కీలక నిందితుడు అరెస్ట్ - iPhone స్వాధీనం
Posted On 2026-08-05 13:09:21
Readmore >
ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-08-04 14:15:02
Readmore >
వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు
Posted On 2026-08-04 14:13:47
Readmore >
"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-08-04 13:06:14
Readmore >