| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

పోలీస్ ప్రజావాణి కార్యక్రమంలో 32 ఫిర్యాదులను స్వీకరించిన సీ పి .సాయి చైతన్య

పోలీస్ ప్రజావాణి  కార్యక్రమంలో  32   ఫిర్యాదులను స్వీకరించిన సీ పి .సాయి చైతన్య

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాదు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫిర్యాదుదారుల సమస్యలను విని వాటిని చట్టప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబందిత అధికారులకు పలు సూచనలు చేశారు.

సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదు దారుల నుండి అర్జీలను స్వీకరించి వాటిని తక్షణ పరిష్కారం కోసం సంబంధిత పోలీస్ స్టేషన్ ల ఎస్.ఐ మరియు సి.ఐ లకు ఫోన్ ద్వారా మాట్లాడి సమస్య స్థితిని, వాటి పరిష్కారానికి సూచనలు చేశారు. ప్రజలు నిర్భయంగా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ఎలాంటి, పైరవీలు లేకుండా స్వచ్చందంగా పోలీసు సేవల్ని వినియోగించుకుంటూ, వారి వారి సమస్యలు చట్ట ప్రకారం పరిష్కరించుకునేలా, పోలీసులు ప్రజలకు మరింత దగ్గరయ్యేలా, శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పని చేస్తుందని ఆయన అన్నారు.  ప్రజా సమస్యలు పై ఫిర్యాదులు నేరుగా స్వీకరిస్తూ ప్రతి సోమవారం  పోలీస్ శాఖ ప్రజావాణి  కార్యక్రమం ద్వారా సమస్యలు పరిష్కారిస్తున్నాము అని అన్నారు.

వివిధ ఫిర్యాదు లకు సంబందించిన    32   ఫిర్యాదు లను స్వీకరించారు.

Previous కాంగ్రెస్ బిఆర్ఎస్ రెండు పార్టీలు తెలంగాణకు తీవ్ర ద్రోహం చేశాయి
Next రేషన్ కార్డు ఉంటే మీ ఇంటికే చీర: పొన్నం ప్రభాకర్
ADVERTISEMENT