Posted on 2025-10-21 19:50:44
ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహర్, సీపీఐ(ఎం.ల్) మాస్ లైన్ జిల్లా కార్యదర్శి
కార్మికుల నిలువుదోపిడీ చేస్తున్న దేశాయి యాజమాన్యం
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో దేశాయి బీడీ కంపెనీ యజమాన్యం ఆర్థిక దోపిడిని ఐక్యంగా ఎండగడదామని,కార్మికుల నిలువు దోపిడీ చేస్తున్న దేశాయి యాజమాన్యం దోపిడీని అరికడదాం అని వక్తలు స్పష్టం చెశారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ లో మంగళవారం విలేకరుల సమావేశంలో దేశాయి బ్రదర్స్ యాజమాన్యం ఇల్లీగల్ గా వేయి భీడీలకు రూ.10 చొప్పున బలవంతంగా తినుబండరాలను అంటగడుతూ అక్రమంగా ఆర్జిస్తున్నారని, దానికి వ్యతిరేకంగా కార్మిక సంఘాలు ఆయా పార్టీల నాయకులతో కలసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. మంగళవారం స్థానిక ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహర్ బిన్ హందన్, సీపీఐ(ఎం.ఎల్.)మాస్ లైన్ నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కార్యదర్శి వి. ప్రభాకర్ మాట్లాడుతూ దేశాయి యజమాన్యం చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తూ నిరుపేద కార్మికుల శ్రమను దోపిడీ చేస్తూ అక్రమార్జనకు పాల్పడుతున్నారని, వీరి ఆగడాలను ఇక సాగనివ్వమని వారు ముక్త కంఠంతో హెచ్చరించారు. బీడీ యాజమమాన్యాలు అక్రమార్జనే ధ్యేయంగా కనీసం కార్మిక చట్టాలను పట్టించుకోకుండా కార్మికులను దోపిడీచేస్తుంటే కార్మికశాఖ అధికారులు ఏం చేస్తున్నారని వారు ప్రశ్నించారు. రోజు వారీగా బీడీలు చుట్టే బీడీ కార్మికులకు రోజు వెయ్యి బీడీలకు గాను చెల్లించలసిన మొత్తంలో నుంచి 10 రూపాయల చొప్పున కోత విధించి వారి పొట్టగొడుతున్నారని దీనిని సహించేదిలేదని మండిపడ్డారు. అమాయక పేద బీడీకార్మికులనుంచి కోట్ల డబ్బును దోపిడీ చేయడం దారుణం అన్నారు. బీడీ పరిశ్రమలో బీడీ కార్మికులకు బలవంతంగా తినుబండారాలను అమ్మడం ఏ కార్మిక చట్టాలు దేశాయ్ యజమాన్యంకు అనుమతించాయని వారు ప్రశ్నించారు. కార్మికుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని దోపిడి చేసే వారి ఆగడాలను ఇక ఏమాత్రం సహించేది లేదన్నారు. దేశాయి యజమాన్యమే కాకుండా ఏ బీడీ కంపెనీ అయినా కార్మికులపై తమ బుద్ది ప్రదర్శించి ఆర్థిక దోపిడికి పాల్పడితే సహించేది కార్మికులతో కలిసి వారికి వ్యతిరేకంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ తో పాటు, కార్మిక శాఖ మంత్రి, లేబర్ కమిషనర్ ప్రకృతి బృందంగా వెళ్లి దేశాయి బ్రదర్స్ ఆర్థికంగా దోచుకున్న డబ్బులు తిరిగి చెల్లించే లాగా చర్యలు తీసుకుంటామన్నారు. దేశాయ్ యాజమాన్యం తమ చట్టవ్యతిరేక ఆర్థిక దోపిడీని మానుకోవాలని సీనియర్ కార్మిక నాయకులు, కామ్ గర్ కార్మిక సంఘం అధ్యక్షులు ఏ. ఎస్. పోశెట్టి లేనిపక్షంలో వారికి వ్యతిరేకంగా కార్మికులతో ఉద్యమం చేపడతామన్నారు. కార్మికుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని దేశాయ్ యాజమాన్యం తమ ఆర్థిక దోపిడీని వెంటనే నిలిపి వేయాలని లేకుంటే సాహించేది లేదని సీనియర్ కార్మిక నాయకులు, కామ్ గర్ కార్మిక సంఘం అధ్యక్షులు ఏ. ఎస్. పోశెట్టి హెచ్చరించారు. ప్రపంచంలో ఏ రంగంలో లేని విధంగా ముడిసరుకులకు సొంత ఖర్చులతో భరించడం కేవలం బీడీ పరిశ్రమలోనే చూస్తున్నమన్నారు. ఇప్పటికైనా దేశా యజమాన్యం తమ అడ్డదారిలో చేస్తున్న దోపిడీని నిలిపివేయాలని, పది సంవత్సరాలనుండి చేసిన వేయికి 10 రూ. తిరిగి కార్మికులకు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. కార్మికులను దేశాయ్ యాజమాన్యం దోచుకోవడం చట్టవిరుద్దాం అని మాజీజడ్పీ చైర్మన్ విఠల్ రావు, దేశాయ్ బ్రదర్స్ యాజమాన్యం కార్మికులను దోచుకోవడం చట్టావిరుద్దాం అని వెంటనే అన్నిరకాల దోపిడీని ఆపివేయాలని మాజీ జెడ్పి చైర్మన్ విఠల్ రావు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో టియుసిఐ జిల్లా అధ్యక్షుడు ఎం.ముత్తేన్న కార్యక్రమమానికి అధ్యక్షత వహించగా ఎఐపికెఎంఎస్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి పి. రామకృష్ణ, ఎఐయుకెఎస్ రాష్ట్ర కార్యదర్శి బి.దేవరాం, సీపీఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు, రైతు జేఏసి నాయకులు యాదగౌడ్, టియుసిఐ ప్రధానకార్యదర్శి ఆర్.రమేష్, ఉపాధ్యక్షురాలు వి.సత్తేవ్వ, కె.రాజేశ్వర్ లు ప్రసంగించగా రౌండ్ టేబుల్ సమావేశంలో సిఐపి ఎంఎల్ మాస్ లైన్ నాయకులు బి. కిషన్, ఆర్ దామోదర్, నిఖిల్, టియుసిఐ కోశాధికారి, అరవింద్ నాయకులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదాల నియంత్రణపై ప్రజల్లో మరింత చైతన్యం రావాలి : ఖమ్మం త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ మోహన్ బాబు
Posted On 2026-04-13 11:03:05
Readmore >
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-04-12 18:47:01
Readmore >
కామారెడ్డి పట్టణంలోని వీఆర్కే ఇంటర్ విద్యార్థులు తమ ప్రతిభతో ఉత్తమ ఫలితాలు సాధించారు
Posted On 2026-04-12 18:45:08
Readmore >
భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు
Posted On 2026-04-12 13:50:08
Readmore >
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు
Posted On 2026-04-12 12:39:23
Readmore >
పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-12 11:41:31
Readmore >