Posted on 2025-10-21 17:30:22
ప్రభుత్వ టీచర్లకు బిగ్ షాక్ తగిలింది. టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని దాఖలు చేసిన పిటిషన్‌ను NCTE రిజెక్ట్ చేసింది. సుప్రీం తీర్పు నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో రెండేళ్లలో తప్పనిసరిగా టెట్ క్వాలిఫై కావాల్సిన పరిస్థితి ఏర్పడింది
డైలీ భారత్, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న టీచర్లకు జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (NCTE) షాక్ ఇచ్చింది. ఇప్పటికే సర్వీసులో ఉన్న ప్రభుత్వ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలన్న వినతిని NCTE తిరస్కరించింది. ఐదేళ్లకు మించి సర్వీసు ఉన్నవారంతా 2 ఏళ్లలో టెట్ పాసవ్వాల్సిందేనని ఇటీవల సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. 2017 పార్లమెంట్ తీర్మానం ప్రకారం ఈ తీర్పు ఇచ్చినందున.. అంతకుముందు నియమితులైన వారికి వర్తింపచేయరాదని టీచర్లు జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలిని ఆశ్రయించారు. అయితే సుప్రీం తీర్పు నేపథ్యంలో NCTE వారి అభ్యర్థనను తిరస్కరించింది. ఈ నిర్ణయంతో లక్షలాది మంది ఉపాధ్యాయులు తమ భవిష్యత్ గురించి కొత్త ఆందోళన చెందుతున్నారు.
ఈ వివాదం సుప్రీంకోర్టు తీర్పుతో ప్రారంభమైంది. ఐదేళ్ల కంటే ఎక్కువ సర్వీస్ ఉన్న అందరూ ఉపాధ్యాయులు కచ్చితంగా టెట్ క్వాలిఫై కావాల్సిందేనని సుప్రీం స్పష్టం చేసింది. రెండేళ్లలో టెట్ పాస్ అవ్వాలని ఆదేశించింది. ఒకవేళ టెట్‌కు క్వాలిఫై అవ్వకపోతే ఉపాధ్యాయులు తప్పనిసరిగా పదవీ విరమణ చేసి.. సర్వీసు నుంచి తొలగిస్తామని ఆదేశించింది. దీంతో ఉపాధ్యాయులు ఉద్యోగ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలిని ఆశ్రయించగా.. అక్కడ కూడా నిరాశే ఎదురైంది.
2017 సవరణలో చేసిన నిబంధనల మాదిరిగానే.. 2017 కి ముందు నియమితులైన ఉపాధ్యాయులకు టెట్ మినహాయింపు నుంచి ఇవ్వాలని NCTE ని కోరారు. ఈ ఉత్తర్వులు అమలుతో విద్యా వ్యవస్థలో తీవ్ర సంక్షోభానికి దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. లక్షలాది మంది ఉపాధ్యాయులు తరగతి గదిలో బోధించడం కంటే.. తమ ఉద్యోగాలను కాపాడుకోవడానికి టెట్‌కు సిద్ధమవ్వడంపై దృష్టిపెడతారని.. దీంతో విద్యార్థులకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని వాదించారు. ఉద్యోగ పోతుందనే భయంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతారని.. ఇది వారి బోధనా పనితీరుపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని పిటిషనర్ల తరుఫున వాదనలు వినిపించారు. అయితే అన్ని ఊహాగానాలకు ముగింపు పలుకుతూ.. ఈ పిటిషన్‌ను అధికారికంగా NCTE కొట్టిపడేసింది. ఈ కేసుకు ముగింపు పలుకుతున్నట్లు స్పష్టం చేసింది
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-04-12 18:47:01
Readmore >
కామారెడ్డి పట్టణంలోని వీఆర్కే ఇంటర్ విద్యార్థులు తమ ప్రతిభతో ఉత్తమ ఫలితాలు సాధించారు
Posted On 2026-04-12 18:45:08
Readmore >
భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు
Posted On 2026-04-12 13:50:08
Readmore >
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు
Posted On 2026-04-12 12:39:23
Readmore >
పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-12 11:41:31
Readmore >
డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే
Posted On 2026-04-11 22:48:59
Readmore >