Posted on 2025-10-21 12:29:19
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: శాంతి భద్రతల పరిరక్షణకై ప్రాణత్యాగాలు చేసిన పోలీస్ అమరవీరులు ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచిపోతారని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు. జిల్లా పరిధిలోని చందుర్తి మండలం లింగంపెట గ్రామ శివారులో గల అమరవీరుల స్తూపం వద్ద పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం (ఫ్లాగ్ డే)ను ఘనంగా నిర్వహించి, అమరవీరుల కుటుంబ సభ్యులు, పోలీస్ అధికారులతో కలసి నివాళులర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. జిల్లాలో అంతర్గత భద్రత పరిరక్షణ విధుల్లో 08 మందికి పైగా పోలీసులు అసువులు బాసారని, వారి త్యాగఫలం వల్లే గతం కంటే ప్రస్తుత పరిస్థితి మెరుగ్గా ఉందని, పోలీసుల త్యాగనిరతిని నిరంతరం మననం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అమరవీరులు అందించిన స్ఫూర్తితో ప్రజల భద్రత, రక్షణ చర్యల్లో భాగంగా శాంతి భద్రతల పరిరక్షణ కోసం ముందుకు సాగుతున్నామన్నారు. దేశంలో విధి నిర్వహణలో మరణించిన192 మంది పోలీస్ అమరవీరుల పేర్లను చదివి వినిపించారు.
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-04-12 18:47:01
Readmore >
కామారెడ్డి పట్టణంలోని వీఆర్కే ఇంటర్ విద్యార్థులు తమ ప్రతిభతో ఉత్తమ ఫలితాలు సాధించారు
Posted On 2026-04-12 18:45:08
Readmore >
భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు
Posted On 2026-04-12 13:50:08
Readmore >
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు
Posted On 2026-04-12 12:39:23
Readmore >
పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-12 11:41:31
Readmore >
డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే
Posted On 2026-04-11 22:48:59
Readmore >