Posted on 2025-10-18 15:31:00
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని డొంకేశ్వర్ మండలం గంగాసముందర్ గ్రామానికి చెందిన శ్రీరామ్ మహిపాల్ చారి నియామకం జరిగింది. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కౌలే జగన్నాథం చేతుల మీదుగా హైదరాబాద్ లోని రాష్ట్ర కార్యాలయంలో నియామక పత్రం అందజేశారు. అఖిలభారత విశ్వకర్మ మహాసభ వర్కింగ్ ప్రెసిడెంట్ గుండోజు గంగాధర్ చారి, ప్రధాన కార్యదర్శి సంకోజు లింగాచారి, మహిళ గౌరవ అధ్యక్షురాలు సావిత్రి పట్నాల వారి సమక్షంలో నియామక పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీరామ్ మహిపాల్ చారి మాట్లాడుతూ విశ్వకర్మల కోసం స్వర్ణకారుల సమస్యలపై అనునిత్యం పోరాడుతానని అలాగే ప్రతినిత్యం విశ్వకర్మలకు అందుబాటులో ఉంటానని, బీసీ రిజర్వేషన్ల సాధనకై విశ్వకర్మలు అందరూ ఐక్యమత్యంతో ఉండి రిజర్వేషన్లు సాధించుకోవాలని పిలుపునిచ్చారు. స్వర్ణకారుల సమస్యలపై దృష్టి సారించి పోరాటం చేస్తానని తెలిపారు. జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నుంచి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియమించినందుకు రాష్ట్ర అధ్యక్షులు కౌలేజగన్నాథం రాష్ట్ర కమిటీ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు.
కామారెడ్డి జిల్లాలో సిసిఎస్ పోలీసుల మెరుపు దాడి : అక్రమ జూదం ఆడుతున్న నలుగురి అరెస్ట్
Posted On 2026-04-09 15:19:40
Readmore >
చిన్నారుల అసాధారణ ప్రతిభ : భగవద్గీత పఠనంలో "ఎలైట్ వరల్డ్ రికార్డ్" సాధించిన అన్నదమ్ములు
Posted On 2026-04-09 14:11:13
Readmore >
యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు... డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-09 06:18:50
Readmore >
తమిళనాడు ప్రధాన కార్యదర్శి గా తెలుగు వ్యక్తి ఎం.సాయికుమార్ బాధ్యతలు స్వీకారం
Posted On 2026-04-09 06:00:41
Readmore >