Posted on 2025-10-17 13:09:12
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: ఆర్టీసీ ప్రయాణికులు సెప్టెంబర్ 26 నుండి ఈనెల 6 వరకు ఆర్ టి సి లోని ప్రత్యేక బస్సుల్లో ప్రయాణించి టికెట్ లను ప్రధాన బస్ స్టాండ్ లో లక్కీ డ్రా కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక బాక్స్ లో వేయడం జరిగింది. ఈ నెల 8న పోలీస్ కమీషనర్ సాయి చైతన్య చేతుల మీదుగా విజేతల ను ఎంపిక చేసారు. ప్రతి జిల్లా లో ముగ్గురిని ఎంపిక చేయడం జరిగిందని ఆర్ ఎమ్ జ్యోత్స్న తెలిపారు. శుక్రవారం ఆర్ టి సి ప్రాంతీయ కార్యలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమం లో ట్రాఫిక్ ఏ సి పి మస్తాన్ అలీ ముఖ్య అతిథి గా విచ్చేసి విజేతలకు చెక్కుల పంపిణి చేసారు. ప్రథమ బహుమతిగా గెలుపొందిన చంద్రయ్యకు 25,000, ద్వితీయ బహుమతిగా గెలుపొందిన షేక్ బాబర్ కు 15,000 రూపాయలు, తృతీయ బహుమతిగా గెలుపొందిన రామ్ ప్రసాద్ కు 10,000 రూపాయలు గెలుపొందిన విజేతలకు బహుమతులుగా ప్రధానం చేసినట్లు ఆమె వివరించారు. రంగారెడ్డి రీజియన్ పరిది లోని సమియా తబస్సుమ్ కు మొదటి బహుమతి. రెండవ బహుమతి అజార్ కు ఇక్కడే చెక్కులను అందచేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఏం జ్యోత్స్న మాట్లాడుతు ఆర్ టి సి ని ఆడారిస్తున్న ప్రయాణికులకు ధన్యవాదాలు తెలియజేసి, ఆధరణ ఎప్పటికి ఆర్ టి సి పై ఇలాగే ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏ సి పి మస్తాన్ అలీ, ఆర్ టి సి రీజియన్ మేనేజర్ జ్యోత్స్న, డిప్యూటీ ఆర్ ఎమ్ మధుసూదన్ రావు, డిపో 1 మేనేజర్ ఆనంద్, పర్సనల్ ఆఫీసర్ పద్మజ, ఆర్ టి సి సిబ్బంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసారు.
డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే
Posted On 2026-04-11 22:48:59
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
Posted On 2026-04-11 19:50:42
Readmore >
జంగంపల్లి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
Posted On 2026-04-11 19:48:36
Readmore >
ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా ఆసుపత్రిలో ‘డి-అడిక్షన్’ సేవలు - ప్రారంభించిన జిల్లా ఎస్పీ
Posted On 2026-04-11 19:47:25
Readmore >
శ్రీనిధి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ మరియు మంజీరా డిగ్రీ అండ్ పీజీ కాలేజీ వార్షికోత్సవం
Posted On 2026-04-11 19:43:57
Readmore >
ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన బీజేపీ నాయుకులు తంబళ్ల రవి
Posted On 2026-04-11 17:12:24
Readmore >