| Daily భారత్
Logo




సామాజిక న్యాయం చెప్పటం కాదు - అమలు చేయాలి

News

Posted on 2026-04-11 17:27:29

Share: Share


సామాజిక న్యాయం చెప్పటం కాదు - అమలు చేయాలి

నేటి సమాజానికి జ్యోతిరావు పూలే ఆదర్శం

వ్యకాస జిల్లా అధ్యక్షులు మెరుగు సత్యనారాయణ

డైలీ భారత్, వైరా: సామాజిక న్యాయం గురించి చెప్పటం కాదని, సామాజిక న్యాయాన్ని అమలు చేయాలని, నేటి సమాజానికి జ్యోతిరావు పూలే ఆదర్శమని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు మెరుగు సత్యనారాయణ అన్నారు. శనివారం వ్యవసాయ కార్మిక సంఘం వైరా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక బోడేపూడి వెంకటేశ్వరరావు భవనంలో జ్యోతిరావు పూలే 199వ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి భూక్యా వీరభద్రం, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు మేరకు సత్యనారాయణ మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.‌ అనంతరం వ్యకాస జిల్లా అధ్యక్షులు మెరుగు సత్యనారాయణ, వైరా డివిజన్ కార్యదర్శి  తాళ్లపల్లి కృష్ణ మాట్లాడుతూ జ్యోతిరావు పూలే, బిఆర్ అంబేద్కర్ జయంతులకు ఈ ప్రభుత్వాలు  పూలమాలలు వేసి నివాళులు అర్పించి 

సామాజిక న్యాయం, అంటరానితనం గురించి పెద్ద, పెద్ద గొప్ప మాటలు, ఉపన్యాసాలు చెప్పటం తప్ప ఆచరణలో చేసింది శూన్యం అన్నారు. మారుతున్న సమాజానికి తగ్గట్టుగా ఇంకా అంటరానితనం, దళితుల రిజర్వేషన్లు పట్ల ఇంకా వివక్షత కొనసాగుతూనే ఉందని అన్నారు. భారత సమాజం అన్ని రంగాల్లో ముందుందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఊకదంపుడు ఉపన్యాసాలు చెపుతున్నారని, ఏ సామాజిక తరగతి వెనుకబాటుకు గురవుతుందో ఆ సామాజిక తరగతి అభివృద్ధి కోసం ప్రభుత్వం పథకాలు, బడ్జెట్లో కేటాయింపులు చేయడంలో వివక్షత చూపిస్తూన్నారని అన్నారు. స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు నిరుద్యోగం, నిరుపేద కుటుంబాలు పెరుగుతున్నాయని అన్నారు. భారత సమాజంలో నిరుద్యోగం, పేదరికం, ఆర్థిక అసమానతలను పూర్తిగా నిర్మూలన చేయడానికి కేంద్ర, రాష్ట్ర పాలకవర్గాలు నిస్వార్థంగా పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు షేక్.నాగుల్ పాషా, తెలంగాణ రైతు సంఘం పట్టణ నాయకులు కొంగర సుధాకర్, సిఐటియీ జిల్లా నాయకులు సుంకర సుధాకర్, పాపగంటి రాంబాబు, వ్యవసాయ కార్మిక సంఘం వైరా పట్టణ అద్యక్ష, కార్యదర్శులు తాటి ఏసు, గుమ్మా నరసింహారావు, నాయకులు ఓర్పు సీతారాములు, చిత్తరు మురళి, కిన్నెర మోతి అమరనేని కృష్ణ, వేల్పుల మైఖేల్,  దేవుళ్ళ కృష్ణ, వల్లపు ఏడు కొండలు, మాడపాటి సుజాత, మేముగట్ల లక్ష్మయ్య, సోషల్ మీడియా వైరా డివిజన్ కన్వీనర్ గుడిమెట్ల మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.

Image 1

సామాజిక న్యాయం చెప్పటం కాదు - అమలు చేయాలి

Posted On 2026-04-11 17:27:29

Readmore >
Image 1

ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన బీజేపీ నాయుకులు తంబళ్ల రవి

Posted On 2026-04-11 17:12:24

Readmore >
Image 1

ప్రజానాట్య మండల రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి

Posted On 2026-04-11 16:26:39

Readmore >
Image 1

కేరళ తరహాలో మున్సిపాలిటీల్లో ఉపాధి పనిని ప్రవేశపెట్టాలి

Posted On 2026-04-11 16:25:00

Readmore >
Image 1

గిరిజన ప్రాంతాల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించడం గర్వకారణం : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS

Posted On 2026-04-11 16:20:14

Readmore >
Image 1

రేషన్ బియ్యం అక్రమ రవాణాపై కఠిన చర్యలు

Posted On 2026-04-11 16:16:39

Readmore >
Image 1

అడిక్షన్ కౌన్సిలింగ్ సెంటర్‌ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ అంకిత్

Posted On 2026-04-11 16:14:19

Readmore >
Image 1

మహాత్మా జ్యోతిబా పూలె జయంతి ఉత్సవాలలో -టిఎన్జీవోస్ కామారెడ్డి జిల్లా శాఖ

Posted On 2026-04-11 16:12:01

Readmore >
Image 1

సింగర్ మంగ్లీపై కేసు నమోదు

Posted On 2026-04-11 11:02:54

Readmore >
Image 1

కామారెడ్డి ఎమ్మెల్యే సహకారంతో ఎంజిఎన్ఆర్ ఈజీఎస్ కింద పది లక్షల విలువగల సీసీ రోడ్లు మంజూరు

Posted On 2026-04-11 10:47:57

Readmore >