Posted on 2025-10-16 23:04:36
డైలీ భారత్ న్యూస్, నర్సంపేట /నల్లబెల్లి క్రైమ్: పది వేల రూపాయల అప్పు ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్న విషాద ఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం కొండాపురం గ్రామంలో జరిగింది. కుటుంబ సభ్యులు, పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం. కొండాపురం గ్రామానికి చెందిన మెరుగుత్తి రమేశ్, సురేశ్ అన్నదమ్ములు . కాగా నాలుగు నెలల కిందట తమ్ముడు సురేశ్ వద్ద అన్న రమేశ్ అవసర నిమిత్తంకి రూ.10 వేలు అప్పుగా తీసుకున్నాడు. ఈ క్రమంలోనే తల్లి సమ్మక్కతో ఇంటి స్థల విషయంపై గొడవ పడుతుండగా అదే సమయంలో మద్యం మత్తులో ఇంటికి వచ్చిన సురేశ్ తన అన్నని డబ్బులు ఇవ్వాలంటూ రమేశ్తో గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య మాటామాటా పెరుగగా క్షణికావేశంలో సురేశ్ కత్తితో అన్న వీపు పై పొట్ట భాగంలో దాడి చేశాడు. పక్కనే ఉన్న వదిన స్వరూప ఆపడానికి ప్రయత్నించగా ఆమె ఛాతి పైనా దాడికి దిగాడు. ఇద్దరికీ తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ స్వరూప మృతి చెందింది. రమేశ్ను మెరుగైన చికిత్స కోసం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం పై మృతురాలి కొడుకు శివకుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై గోవర్ధన్ తెలిపారు.
డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే
Posted On 2026-04-11 22:48:59
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
Posted On 2026-04-11 19:50:42
Readmore >
జంగంపల్లి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
Posted On 2026-04-11 19:48:36
Readmore >
ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా ఆసుపత్రిలో ‘డి-అడిక్షన్’ సేవలు - ప్రారంభించిన జిల్లా ఎస్పీ
Posted On 2026-04-11 19:47:25
Readmore >
శ్రీనిధి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ మరియు మంజీరా డిగ్రీ అండ్ పీజీ కాలేజీ వార్షికోత్సవం
Posted On 2026-04-11 19:43:57
Readmore >
ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన బీజేపీ నాయుకులు తంబళ్ల రవి
Posted On 2026-04-11 17:12:24
Readmore >