Posted on 2025-10-16 22:23:00
డైలీ భారత్ న్యూస్, వరంగల్:వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదేశించారు.
గురువారం వరంగల్ లో నిర్మాణంలో ఉన్న వరంగల్ సూపర్ స్పెషాలిటి హాస్పటల్ ను కలెక్టర్ సందర్శించి సంబంధిత అధికారులతో సమావేశమై పనుల పురోగతిని సమీక్షించారు.
ఈ సందర్భంగా భవనంలోని సివిల్, ఎలక్ట్రికల్ పనుల వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకొన్నారు. ప్రతి అంతస్తు లోని నిర్మాణ స్తితి గతులను తెలుసుకొని, అట్టి నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే, వైద్య పరికరముల అమరికను మరియూ మంచినీటి సౌకర్యాలు, రోడ్ల నిర్మాణం, మురుగు నీటి పారుదల తదితర గురించి తెలుసుకున్నారు. వివిద శాఖాధిపతులలో వారి శాఖలకు కేటాయించిన స్థలములో మార్పులు మరియి ఇతర అవసరాల గురించి చర్చించారు.
ప్రతి దశలో పనుల పురోగతిని తనిఖీ చేస్తూ, అవసరమైన మౌలిక వసతులను సమకూర్చేందుకు సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు.
ఈ సమావేశంలో యం. జి. యం. హాస్పటల్ సూపరింటెండెంట్ కిషోర్, కెఎం సి ప్రిన్సిపాల్ సంధ్యారాణి, ఆర్. ఎం. వోలు, వివిధ విభాగాల అధిపతులు, ఆర్.& బి డిపార్ట్మెంట్ ఇజనీర్లు, ఎల్ & టి అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే
Posted On 2026-04-11 22:48:59
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
Posted On 2026-04-11 19:50:42
Readmore >
జంగంపల్లి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
Posted On 2026-04-11 19:48:36
Readmore >
ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా ఆసుపత్రిలో ‘డి-అడిక్షన్’ సేవలు - ప్రారంభించిన జిల్లా ఎస్పీ
Posted On 2026-04-11 19:47:25
Readmore >
శ్రీనిధి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ మరియు మంజీరా డిగ్రీ అండ్ పీజీ కాలేజీ వార్షికోత్సవం
Posted On 2026-04-11 19:43:57
Readmore >
ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన బీజేపీ నాయుకులు తంబళ్ల రవి
Posted On 2026-04-11 17:12:24
Readmore >