Posted on 2025-10-16 22:19:54
డైలీ భారత్ న్యూస్, నర్సంపేట/చెన్నారావు పేట:పోషణ మాసం సందర్భంగా ఐసిడిఎస్ నర్సంపేట పరిధిలోని చెన్నారావుపేట, తిమ్మరాయనపాడ్ సెక్టార్ సూపర్వైజర్లు రాధా, పారిజాతం ఆధ్వర్యంలో పోషణ మాసం కార్యక్రమాన్ని చెన్నారావుపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించడం జరిగింది . ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిడిపిఓ మధురిమ, డాక్టర్ సరోజ ముఖ్య అతిథులుగా హాజరై. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోషణ మాసంలో జరుగుతున్న వివిధ కార్యక్రమాలపై అవగాహన కల్పించడం జరిగింది. గర్భిణీలో బాలింతలు కిశోర బాలికలు, చిన్నపిల్లలు ప్రోటీన్స్,విటమిన్లతో కూడిన సమతుల ఆహారం తీసుకోవాలన్నారు. కిశోర బాలికలకు రక్తహీనత పై అవగాహన కల్పించి ఐరన్ అధికంగా ఉండే ఆహరపదార్థాలను సమృద్ధిగా తీసుకోవాలని తెలిపారు. స్త్రీల రుతుక్రమ పరిశుభ్రత పై అవగాహన కల్పించారు. సరైన పోషణకహారం తీసుకోవడం స్థానికంగా లభించే ఆకుకూరలు పండ్లు కూరగాయలు చిరుధాన్యాలతో చేసినటువంటి రాగి జావా,మిల్లెట్స్ తో చేసినటువంటి ఆహారాలు అధికంగా తీసుకోవాలని సూచించారు. అనంతరం వెల్ బేబీ షో నిర్వహించి పిల్లలకు బహుమతులు ప్రధానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పోషణ అభియాన్ కోఆర్డినెటర్స్ శ్రీలత,అనిత, ఐకెపి సభ్యులు, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు తదితరులు పాల్గొన్నారు.
డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే
Posted On 2026-04-11 22:48:59
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
Posted On 2026-04-11 19:50:42
Readmore >
జంగంపల్లి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
Posted On 2026-04-11 19:48:36
Readmore >
ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా ఆసుపత్రిలో ‘డి-అడిక్షన్’ సేవలు - ప్రారంభించిన జిల్లా ఎస్పీ
Posted On 2026-04-11 19:47:25
Readmore >
శ్రీనిధి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ మరియు మంజీరా డిగ్రీ అండ్ పీజీ కాలేజీ వార్షికోత్సవం
Posted On 2026-04-11 19:43:57
Readmore >