| Daily భారత్
Logo




ప్రభుత్వ హాస్పిటల్ లోనే డెలివరీ కావాలి : జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్

News

Posted on 2025-10-16 19:28:53

Share: Share


ప్రభుత్వ హాస్పిటల్ లోనే డెలివరీ కావాలి : జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్

వైద్య అధికారుల  పని తీరు మెరుగు పడాలి

నిరుపేదలకు మెరుగైన వైద్యం అందాలి

డైలీ భారత్, జనగాం: ప్రభుత్వ ఆసుపత్రుల మీద ప్రజలకు ఎంతో నమ్మకం ఉంటుందని దాన్ని కాపాడుకునే విధంగా వైద్య అధికారులు సేవాలాందించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు

వైద్య సేవలకు సంబందించిన వివిధ అంశాల మీద  పీహెచ్ సి ల వారీగా...జిల్లా వైద్య అధికారి, అన్ని పీహెచ్ సి ల మెడికల్ అధికారులు, సూపరవైజర్ లతో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సమీక్షించారు

ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ... 

ప్రభుత్వం పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని....దీన్ని దృష్టిలో పెట్టుకొని వైద్య సేవల విషయం లో మెడికల్ అధికారులు బాధ్యత యుతం గా పని చేయాలన్నారు

కార్పొరేట్ ఆసుపత్రి లకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రి లలో  అత్యాధునిక వైద్య పరికరాలు, యంత్రాలు ఉన్నాయన్నారు 

అందుకు తగ్గట్టు గా డాక్టర్ లు తమ విధులను నిర్వర్తించాలన్నారు 

ప్రసవాలు  కేవలం ప్రభుత్వ ఆసుపత్రి లోనే జరగాలని..

క్లస్టర్ లెవల్ సమీక్షా సమావేశాలు నిర్వహించి పురోగతి సాధించాలన్నారు

మాతృ ఆరోగ్యం & పోషణ కార్యక్రమం (MHN), క్యాన్సర్, మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులు & స్ట్రోక్ నివారణ & నియంత్రణ జాతీయ కార్యక్రమం (NPCDCS), బాల ఆరోగ్యం మరియు టీకా కార్యక్రమం, జాతీయ క్షయ వ్యాధి నిర్మూలన కార్యక్రమం (NTEP), వెక్టార్ బోర్న్ వ్యాధి నియంత్రణ కార్యక్రమం (NVBDCP), సీజనల్ వ్యాధులు తదితర కార్యక్రమాల పురోగతి ని కలెక్టర్  ప్రతీ పీహెచ్ సి  మెడికల్ అధికారి ని అడిగి తెలుసుకున్నారు 

ఫీల్డ్ స్థాయి పర్యవేక్షణను మరింత బలపరచాలని, నివేదికల ఖచ్చితత్వాన్ని మెరుగుపరచాలని, అన్ని ఆరోగ్య సూచికలను సమయానికి సాధించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

ముఖ్యంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సాధారణ ప్రసవాల సంఖ్య పెంపుపై దృష్టి సారించాలని, ప్రసవాలు జరపని వైద్యాధికారులపై శూన్య సహనం (Zero Tolerance) విధించాలని, అలాగే తీవ్ర, మధ్యస్థ పోషకాహార లోపం (SAM/MAM) ఉన్న పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించాలని ఆదేశించారు.

తక్కువ పనితీరు కనబరిచిన ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, గ్రామస్థాయిలో అన్ని ఆరోగ్య కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు చేయాలని వైద్యాధికారులకు సూచించారు.

జిల్లా లో వైరల్, డెంగ్యూ  జ్వరాలు ప్రబల కాకుండా  తగు చర్యలు తీసుకోవాలని... ఫీవర్ సర్వే ను నవంబర్ 15 వరకు కొనసాగించాలన్నారు

జిల్లా లోని ప్రభుత్వ రీసెడెన్షియల్ విద్య సంస్థ లలో చదువుతున్న ప్రతీ విద్యార్థి కి  ఇచ్చిన హెల్త్ కార్డు లో ఉన్న పరీక్ష లను నెలరోజులో పూర్తి చేయాలన్నారు

పేద కుటుంబాలకు  చెందిన విద్యార్థుల చదువు తో పాటు వారి ఆరోగ్యన్ని  కూడా కాపాడలిసిన అవసరం మెడికల్ అధికారుల మీద ఉందని గమనించాలన్నారు

ఈ సమావేశానికి డా. కె. మల్లిఖార్జున రావు, జిల్లా వైద్య & ఆరోగ్య అధికారి,  ప్రోగ్రాం అధికారులు, PHC & RBSK వైద్యాధికారులు, రిపోర్టింగ్ సూపర్వైజర్లు,  ఇతర జిల్లా ఆరోగ్య సిబ్బంది హాజరయ్యారు.

Image 1

మేము కొన్ని తప్పులు చేశాము

Posted On 2026-04-12 22:37:33

Readmore >
Image 1

జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-04-12 18:47:01

Readmore >
Image 1

కామారెడ్డి పట్టణంలోని వీఆర్కే ఇంటర్ విద్యార్థులు తమ ప్రతిభతో ఉత్తమ ఫలితాలు సాధించారు

Posted On 2026-04-12 18:45:08

Readmore >
Image 1

సింగర్ ఆశా భోంస్లే కన్నుమూత

Posted On 2026-04-12 16:53:08

Readmore >
Image 1

భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు

Posted On 2026-04-12 13:50:08

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు

Posted On 2026-04-12 12:39:23

Readmore >
Image 1

భారీ అగ్నిప్రమాదం

Posted On 2026-04-12 12:10:38

Readmore >
Image 1

పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

Posted On 2026-04-12 11:41:31

Readmore >
Image 1

శీర్షిక : ఆడది ఆటబొమ్మ కాదు-- మంజుల పత్తిపాటి

Posted On 2026-04-12 08:16:03

Readmore >
Image 1

డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే

Posted On 2026-04-11 22:48:59

Readmore >