| Daily భారత్
Logo




జిల్లా బిజెపి అధ్యక్షుడు దినేష్ కులచారి ఆర్మూర్ బిజెపి ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ల మధ్య వార్..

News

Posted on 2025-09-26 18:34:56

Share: Share


జిల్లా బిజెపి అధ్యక్షుడు దినేష్ కులచారి ఆర్మూర్ బిజెపి ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ల మధ్య వార్..

బిజెపి జిల్లా పార్టీ కార్యాలయం కేంద్రంగా ఇరువురి మధ్య వాగ్వివాదం

ఫ్లెక్సీలో తన ఫోటో లేదని అలిగిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి..

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ జిల్లా పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలో  తన ఫోటో లేకపోవడంపై  ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి తీవ్ర అసహనానికి గురయ్యారు. నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్, పార్టీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారిల జన్మదినం సందర్భంగా పార్టీ నాయకులు జిల్లా పార్టీ కార్యాలయం వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇద్దరు నేతల జన్మదినోత్సవాన్ని పురస్కరించుకోని నాయకులు, అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో జాతీయ నాయకులతో పాటు రాష్ట్ర, జిల్లాకు చెందిన ముఖ్య నాయకుల ఫోటోలు ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా నుండి కేవలం ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వారిలో నిజామాబాద్ అర్బన్ నుండి దన్పాల్ సూర్యనారాయణ గుప్తా, ఆర్మూర్ నుండి పైడి  రాకేష్ రెడ్డిలు  ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. నాయకులు ఏర్పాటు చేసిన  ఫ్లెక్సీలో  జాతీయ, రాష్ట్ర, జిల్లా నాయకులతోపాటు అర్బన్ ఎమ్మెల్యే దన్ పాల్ సూర్యనారాయణ గుప్తా ఫోటో ఏర్పాటు చేశారు. ఇందులో జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఫోటో లేకపోవడం ఎమ్మెల్యేను అగ్రహానికి గురిచేసింది. గురువారం జిల్లా పార్టీ కార్యాలయంలో  దీన దయాల్ ఉపాధ్యాయ జయంతిని పురస్కరించుకొని  కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు తో పాటు  అర్బన్ ఎమ్మెల్యే, ఆర్మూర్ ఎమ్మెల్యే ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. గురువారం ఉదయం  కార్యక్రమానికి హాజరవ్వడానికి వచ్చిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి దృష్టి ఫ్లెక్సీ ల పై పడింది. ఫ్లెక్సీలో తన ఫోటో ఫ్లెక్సీ ల పై లేకపోవడంపై  పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారితో  వాగ్వివాదానికి దిగాడు. ఆర్మూర్  నియోజకవర్గం నుండి పార్టీ తరఫున గెలుపొంది ఎమ్మెల్యే కొనసాగుతున్న తనను పార్టీ గుర్తించకపోవడంపై ఆయన తీవ్రస్థాయిలో అసహనానికి లోనయ్యారు. ఈ విషయాన్ని అర్బన్ ఎమ్మెల్యే ముందే జిల్లా అధ్యక్షునితో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సీరియస్ గా  ప్రస్తావించడంతో  అక్కడే ఉన్న నాయకులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. పార్టీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యేకు సమాధానం ఇస్తూ మరోసారి ఎలాంటి పొరపాటు జరగకుండా చొరవ  తీసుకుంటానని  హామీ ఇవ్వడంతో ఎమ్మెల్యే శాంతించి కార్యక్రమానంతరం  అక్కడి నుండి అసంతృప్తితో  వెళ్లిపోయాడు.


Image 1

జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-04-12 18:47:01

Readmore >
Image 1

కామారెడ్డి పట్టణంలోని వీఆర్కే ఇంటర్ విద్యార్థులు తమ ప్రతిభతో ఉత్తమ ఫలితాలు సాధించారు

Posted On 2026-04-12 18:45:08

Readmore >
Image 1

సింగర్ ఆశా భోంస్లే కన్నుమూత

Posted On 2026-04-12 16:53:08

Readmore >
Image 1

భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు

Posted On 2026-04-12 13:50:08

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు

Posted On 2026-04-12 12:39:23

Readmore >
Image 1

భారీ అగ్నిప్రమాదం

Posted On 2026-04-12 12:10:38

Readmore >
Image 1

పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

Posted On 2026-04-12 11:41:31

Readmore >
Image 1

శీర్షిక : ఆడది ఆటబొమ్మ కాదు-- మంజుల పత్తిపాటి

Posted On 2026-04-12 08:16:03

Readmore >
Image 1

డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే

Posted On 2026-04-11 22:48:59

Readmore >
Image 1

సిరిసిల్ల నేతన్న అద్భుత సృష్టి

Posted On 2026-04-11 21:25:59

Readmore >